हिन्दी | Epaper

Space City: త్వరలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రారంభం

Saritha
Space City: త్వరలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్రంలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభం కానుంది. ఆధ్మాత్మిక నగరం తిరుపతిలో స్పేస్ సిటీ (Space City) ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పేస్ సిటీ ప్రాజెక్టు తొలి విడతను త్వరలోనే ఏపీ ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు తెలిసింది. తిరుపతిలో 2800 ఎకరాలలో స్పేస్ సిటీ ప్రాజెక్టు చేపడుతున్నారు. మరో రెండు నెలలలో ఈ ప్రాజెక్టు తొలి విడతను చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. రీసెర్చ్, శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏరోస్పే్స్ టెక్నాలజీ హబ్‌గా ఈ స్పేస్ సిటీని తీర్చిదిద్దాలని ప్రణాళికలు రచిస్తున్నారు.

Read Also: Anantapur Minerals: ఏపీలో ఖరీదైన అరుదైన ఖనిజాలు గుర్తింపు

Space City: త్వరలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రారంభం

బుచ్చినాయుడు కండ్రిగ ప్రాంతంలో ప్రాజెక్టు ఏర్పాటు

తిరుపతి జిల్లాలోని బుచ్చినాయుడు కండ్రిగ ప్రాంతంలో ఈ మెగా స్పేస్ సిటీ ప్రాజెక్టు చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో చేపడుతున్నారు. స్పేస్ సిటీ ప్రాజెక్టు (Space City) మొదటి దశలో 570 ఎకరాలలో 140 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కోర్ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ మొదలు పెడతారు. మిగతా భూమిని రెసిడెన్సియల్ జోన్లు, ఇన్‌స్టి్ట్యూషనల్ క్యాంపస్, లాజిస్టిక్ పార్కులు, అంతర్గత రహదారుల అభివృద్ధి , హైస్పీడ్ ఇంటర్నెట్, కరెంట్, తాగునీటి సరఫరా వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ఉపయోగిస్తారు.

స్పేస్ సిటీలో ఉపగ్రహాల అసెంబ్లింగ్, టెస్టింగ్, ఆర్‌అండ్‌డీ కేంద్రాలతో పాటు స్పేస్ టెక్ స్టార్టప్‌లకు ఇంక్యుబేషన్ హబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. శ్రీహరికోట స్పేస్ సెంటర్, తిరుపతి విమానాశ్రయం, జాతీయ రహదారులు, పోర్టులకు సమీపంగా ఉండటం వల్ల ఈ ప్రాంతాన్ని వ్యూహాత్మకంగా ఎంపిక చేశారు. స్పేస్ సిటీ ప్రాజెక్టుతో ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, టెక్నీషియన్లు, డేటా నిపుణులు సహా అనుబంధ రంగాల్లో విస్తృతంగా ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రాథమిక సర్వేలు, పర్యావరణ అంచనాలు, స్థానికులతో సంప్రదింపులు ఇప్పటికే పూర్తయ్యాయి. తొలి విడతను త్వరలోనే ఏపీ ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు తెలిసింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

📢 For Advertisement Booking: 98481 12870