భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు పుట్టి నిల్లుగా పదేపదే ఎంతో గొప్పగా చెప్పుకుం టుంటాం. కానీ సమాజంలో పూజనీయులైన మహిళల రక్షణ విషయంలో చెప్పుకోదగిన గౌరవ మర్యాదలతో ప్రవర్తించలేకపోతున్నాం. మహిళా రక్షణ విషయంలో ఎన్నో చట్టాలు తీసుకువచ్చారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు నివారించేందుకు పటిష్టమైన, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు పాలక పెద్దలు చెప్తూనే ఉంటారు. మరొకపక్క మహిళా సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి పథకాల మీద పథకాలు ప్రవేశపెడుతున్నట్లు ప్రచారం పెద్దఎత్తునేజరుగుతున్నది. ఈ ప్రభుత్వం, ఆప్రభుత్వం అని కాదు ఎవరు అధికారంలో ఉన్నా ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆచరణకు వచ్చేసరికి అవి అంతగా అమ లుకు నోచుకోవడంలేదేమోననిపిస్తున్నది. చట్టసభల్లో మహిళా బిల్లు ఏనాడో అటకెక్కించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని పాలకులు ఎంతగా చెప్తున్నారో ఆ చట్టం తమను ఏమీ చేయలేదనే దీమాతో మహిళలపై నేరాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. వాస్తవంగా చదువు సంధ్యలు పెరిగేకొద్దీ విజ్ఞానం ఆర్జించే కొద్దీ మనుషుల ప్రవర్తనలో మార్పురావాలి. సభ్యత, సంస్కారం మరింత పెరగాలి. దురదృష్టవశాత్తు అందుకు విరుద్ధంగా తిరోగమిస్తున్నామేమోననిపిస్తున్నది. తాజాగా నిన్న సోమవారం పట్టపగలు ఒక ప్రేమోన్మాది (Screamers) పిచ్చెక్కినట్లు యువతి ఇంటి కే వెళ్లి తల్లిదండ్రులు చూస్తుండగానే కత్తితో గొంతు కోసి హత్యచేశాడు. సికింద్రాబాద్ నడిబొడ్డులోని వారాసిగూడ పోలీసుస్టేషన్ పరిధిలో బతుకు తెరువు కోసం నగరానికి వచ్చి జీవనం సాగిస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన ఒక యువతిని వారి దూరపు బంధువుగా చెప్పుకుంటున్న యువకుడు తనను పెళ్లి చేసుకోవాలని బలవంత పెట్టాడు. అయితే ముందుగా ఆమె నిరాకరించకపోయి నా ఆ తర్వాత అతని ప్రవర్తన, అలవాట్లను తెలుసుకొని పెళ్లికి తిరస్కరించింది. దీంతో కక్షపూనిన ఆ యువకుడు సోమవారం ఉదయం
ఇంటికి వచ్చి ఆ యువతిపై దాడి చేశాడు. ఆ సమయంలో యువతి తల్లిదండ్రులు, మరో చెల్లి కూడా అక్కడే ఉంది. తనతోపాటు తెచ్చుకున్న కత్తితో గొంతుకోసి, అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో ఆ తల్లిదండ్రులు కళ్లముందు జరిగిన ఆ సంఘట నతో నిశ్చేష్టులైపోయారు. కళ్లముందే బిడ్డను చంపడంతో కన్నీరు మున్నీరయ్యారు. ఇక నిర్మల్లో ఒక టీస్టాల్ నడుపుకుంటున్న మహిళలపై ఒక కిరాతకుడు (Screamers) దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. సోమవారం ఉదయం అందరు చూస్తుండగానే కత్తితో టీస్టాల్ వద్దకు వచ్చి ఆమెను నేరుగా విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్రంగా గాయ పడిన ఆ మహిళ కుప్పకూలిపోగా అక్కడున్న స్థానికులు భయంతో పారిపోయారు. అయితే యువతి చనిపోయే వరకు ఆ రాక్షసుడు అక్కడే కూర్చొని అదే టీస్టాల్లో టీతాగుతూ కాలం గడిపాడు. పోలీసులు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి సంఘటనలు తరచు గా జరుగుతున్నాయి. పోలీసులన్నా, చట్టాలన్నా భయం సన్న గిల్లిపోతున్నది. ఇక అత్యాచారాల గురించి చెప్పక్క ర్లేదు. మొన్న తిరుపతిలోని సంస్కృత విశ్వవిద్యాలయం లో ఒక విద్యార్థినిపై అత్యాచారం జరిగిన సంఘటన విస్తుపోయేలా చేస్తున్నది. అందులో కొందరు అధ్యాపకుల పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ యువతి తనకు జరిగిన దారుణాన్ని గూర్చి ఫిర్యాదు చేసి మౌనంగా తన రాష్ట్రానికి వెళ్లిపోయింది. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ దృష్టికిపోవడంతో స్పందించి దర్యాప్తునకు ఆదేశించారు. ఆ జిల్లా ఎస్పిని ప్రత్యేకంగా ఈ కేసు దర్యాప్తులో శ్రద్ధ తీసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. ప్రత్యేకటీమ్లను ఆ యువతి స్వరాష్ట్రానికి పంపి వివ రాలు సేక రిస్తున్నట్లు పోలీసు ఉన్నతవర్గాలు చెబుతు న్నాయి. మరొక పక్క ఆ రాష్ట్ర హోంమంత్రి దీనిపై మాట్లాడుతూ ఎలాంటి పరిస్థితుల్లోనూ అందుకు కారకు లైన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అధికారులు, పాల కులు స్పందించడం, ఆ తర్వాత మరచిపోవడం సాధార ణమైపోతున్నది. అందుకే కేసులన్నా, చట్టాలన్నా నేర స్తుల్లో భయం, గౌరవం క్రమేణా సన్నగిల్లుతున్నాయి. ఇలా ఎందరో మహిళలు సమస్యలు ఎదుర్కొం టున్నారు. బయటకు చెప్పుకోలేక అటు పోలీసు స్టేషన్ గడప ఎక్కలేక తమలోతాము కృంగిపోతూ ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు తరుచుగా చోటుచేసుకుంటు న్నాయి. తాము పోతే పిల్లలకు దిక్కు ఉండరనే భయాందోళనతో పిల్లలను కూడా చంపి ఆత్మహత్యలకు పాల్ప డుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. దీనికితోడు కుల, మత, వర్గాలకు అతీతంగా సమాజాన్ని తీర్చిదిద్దే ప్రయ త్నం జరుగుతుంటే మరొకపక్క మూర్తీభవించిన మూఢ నమ్మకాలు, కుల వ్యవస్థపై ఉన్న భ్రమలతో నేటికీ కన్న తల్లిదండ్రులు హత్యలకు పాల్పడుతున్నారు. తమ ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఆత్మహత్యల కు పాల్పడుతున్నయువతీ యువకులు ఎందరో ఉన్నారు. ఇక ఇలా ప్రేమవివాహం పేరుతో జరుగుతున్న మోసాలు అన్నీఇన్నీ కావు. అత్యాచారాలు, బలత్కారాలు, వెంటపడి వేధించే కీచకులు పెచ్చరిల్లిపోతున్నారు. అలాని పాలకులు ఏం చేయడంలేదని చెప్పడం లేదు. నిర్భయ చట్టంతో వీటిని కొంతవరకైనా నియంత్రించవచ్చని ఆశించారు. కానీ అది నిరాశే అయింది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు చట్టాలుచేసి చేతులు దులుపుకోకుండా ఆచరణకు త్రికరణ శుద్ధిగా ప్రయత్నించాలి. శిక్షల నుంచి తప్పించు కోలేమనే భయం నేరస్తుల్లో కలిగించాలి. అప్పుడే ఈ పశుప్రవృత్తికి కొంతవరకైనా పగ్గాలు వేయగలుగుతారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: