ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ అధిష్టానం తీసుకున్న తాజా నిర్ణయం రాజకీయ పరిశీలకుల దృష్టిని ఆకర్షిస్తోంది.సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నచోట ఇంఛార్జ్‌ను నియమించడం ఆసక్తికరంగా మారింది. పేరుకు నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ అని చెబుతున్నా నియోజకవర్గ పగ్గాలు ఆయనకే అప్పగించారని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్‌గా కూరపాటి శంకర్ రెడ్డిని నియమించింది టీడీపీ. ఈ మేరకు ఆయన పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.స్వయంగా జిల్లా ఇంఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ కార్యక్రమాన్నికి హాజరయ్యారు. కూరపాటి శంకర్ రెడ్డి తిరుపతికి చెందిన పారిశ్రామికవేత్త, ఆయన గత ఎన్నికల్లో టికెట్ ఆశించినా కుదరలేదు. దీంతో తిరుపతి జిల్లాలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారు. శంకర్ రెడ్డి (Shankar Reddy) కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతుంటారు. అందుకే ఆయనకు సత్యవేడు బాధ్యతలు అప్పగించారని టాక్ వినిపిస్తోంది.
నియోజకవర్గ బాధ్యతల్ని
ప్రస్తుతం సత్యవేడులో టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కోనేటి ఆదిమూలం ఉన్నారు.ఆయన ఉండగానే నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ నియామకం ఆసక్తికరంగా మారింది. అయితే నియోజకవర్గంలో ప్రభుత్వం, పార్టీ కార్యక్రమాలను కోఆర్డినేట్ చేయడం కోసం శంకర్ రెడ్డిని నియమించారని చెబుతున్నా, నియోజకవర్గ బాధ్యతల్ని ఆయనకు అప్పగించారా, అనే చర్చ నడుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం (koneti Adimulam) గతేడాది ఓ వివాదంలో చిక్కుకున్నారు.ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. అయితే ఆయనపై ఫిర్యాదు చేసిన మహిళ తన ఆరోపణల్ని వెనక్కు తీసుకోవడంతో ఆదిమూలం మళ్లీ పార్టీలో యాక్టివ్ అయ్యారు. అంతా బావుందిలే అనుకుంటున్న సమయంలో సత్యవేడు నియోజకవర్గానికి ఇంఛార్జ్ నియామకం ఆసక్తికరంగా మారింది.

కార్యకర్తలతో సమావేశం
సత్యవేడు నియోజకవర్గ బాధ్యతల్ని శంకర్ రెడ్డికి అప్పగించడం ద్వారా, అధిష్టానం మిగిలిన ఎమ్మెల్యేలకు కూడా ఎవైనా సంకేతాలు పంపిందా అనే చర్చ జరుగుతోంది. అలాగే ఇటీవల మంత్రి నారా లోకేష్ సత్యవేడు నియోజకవర్గం (Satyavedu Constituency) లో పర్యటించేందుకు వెళ్లారు. ఆ సమయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత కొద్ది నెలలకే ఇలా ఇంఛార్జ్‌ను నియమించడం ఆసక్తికరంగా మారింది. నియోజకవర్గంలో సమన్వయ బాధ్యతల్ని శంకర్ రెడ్డికి అప్పగిచడంతో, ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంతో కలిసి ముందుకు సాగాల్సి ఉంటుంది. మరి ఈ ఇద్దరు నేతల మధ్య కో ఆర్డినేషన్ ఎలా ఉంటుందనే చర్చ, జరుగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: APSRTC : లగ్జరీ బస్సు టికెట్ ధరకే ఏసీ బస్సులో ప్రయాణించొచ్చు..