జైష్ ఎ మొహమ్మద్ ఉగ్రవాదుల అరెస్ట్ : జిల్లా ఎస్పీ సతీష్ కుమార్
సత్యసాయి జిల్లా : ప్రజలు ఉగ్ర కార్యకలాపాలపై ప్రమత్తంగా ఉండాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ తెలియజేశారు. పాకిస్తాన ఎస్ ఐ ఆధారిత జైష్ ఎ మొహమ్మద్ (Jaish-e-Mohammed) కు చెందిన పలువురు వాట్సాప్ గ్రూప్లలో సభ్యుడిగా(Satish kumar)ఉన్న ఉత్తర్ ప్రదేశ్ నివాసి సాజాద్ హుస్సైన్ మరియు మహారాష్ట్ర నివాసి తౌఫీక్అల్ శ్రీకం లను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, గతంలో ధర్మవరం పట్టణానికి చెందిన కోత్వాల్ నూర్ మొహమ్మద్ (42) పాకిస్తాన్ శ్రీ। ఆధారిత జైష్ ఎ మొహమ్మద్ (జే ఈ ఎం) కు చెందిన పలువురు వాట్సాప్ గ్రూప్లలో సభ్యుడిగా ఉంటూ, భారతీయ భూభాగం లో రాడికల్/జిహాది కార్యకలాపాలలో పని చేస్తుండడం తో అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. పాకిస్తాన్ లోని జిహాది కార్యకర్తలతో సంబంధాలు కలిగి ఉండి భారతదేశం వ్యతిరేక చర్యలు చేపట్టే యత్నాలు చేస్తారని గుర్తించడం జరిగిందన్నారు. మరింత దర్యాప్తులో, ఇంటెలిజెన్స్ సమాచారంపై ఆధారపడి, మరొక ఇద్దరు జిహాది సభ్యులను గుర్తించామని, ఉత్తర్ ప్రదేశ్ నుండి సాజాద్ హుస్సైన్ మరియు మహారాష్ట్ర నుండి తౌఫీక్ 13.10.2025 5, 2 పోలీస్ బృందాలు, ఉత్తర్ ప్రదేశ్ పోలీస్నహకారంతో అమ్రోహా లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి సాజాద్ హుస్సైన్ (ఎ 2) ను అరెస్టు చేశారన్నారు. అతను జామా మదరాసలో అలిం కోర్సు చేస్తున్నాడని, అతని వద్ద నుండి ఎలెక్ట్రానిక్ గాడ్జెట్స్ మరియు జిహాది మెటీరియల్ స్వాధీనము చేసుకున్నట్లు తెలిపారు. తనిఖీలో భాగంగా జంపర్వా లోని సజాద్ హుస్సైన్ నివాసం ఉంటున్న ఇంటి నుండి ఒక సింగిల్ బారెల్ రైఫిల్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.
Read also: HYDలో బీసీ బంద్ ఉద్రిక్తతలు – నల్లకుంటలో పెట్రోల్ బంక్‌పై దాడి

జిహాదీ మెటీరియల్, ఎలక్ట్రానిక్ పరికరాల స్వాధీనం
ఇది అతని బంధువుది అని, సదరు ఆయుధంను జిహాదీ కార్యాక్రమాలను ఉపయోగించేవారని (13.10.2025) ఏపీ పోలీస్ మరియు మహారాష్ట్ర ఏటిఎస్ బృందాలు రైడ్లు నిర్వహించి తౌఫీక్ ఆలమ్ షేక్ (ఎ 3) ను నాసిక్, మలేగావుల్లో అరెస్టు చేసినట్లు తెలిపారు. అరెస్టు సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాలు(Satish kumar)మరియు జిహాది మెటీరియల్ ను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ ఇద్దరు ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఉన్న జైష్ ఆధారిత వాట్సాప్ గ్రూప్లు, చానల్స్ లలో క్రియాశీలక సభ్యులుగా ఉన్నట్లు తెలిపారు. వీరు జే ఈ ఎం ఆపరేటర్లతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉండి తల్లా భాయ్ (మోలానా మసూద్ అజార్ సోదరుడు-చీఫ్ ఆఫ్ జే ఈ ఎం అండ్ అదర్స్), యువతను జిహాది కోసం రాడికలైజ్ చేస్తూ, వారు పాకిస్తాన్లో మిలటరీ శిక్షణ తీసుకొని భారతదేశం పై యుద్ధం చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఈ ఇద్దరు ముద్దాయి లను అరెస్టు చేసి, స్థానిక న్యాయస్థానాల్లో హాజరు పరచిన అనంతరము ట్రాన్సిట్ వారంట్లపై వారిని ధర్మవరంకు తీసుకురావడం జరిగిందన్నారు. త్వరలో న్యాయస్థానాల్లో జడీషియల్ రిమాండ్ కోసం కు పంపడం జరుగుతుందన్నారు. భారత దేశం లో నిషేదిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పి ఎఫ్ ఐ) ఇంకా వీటి యొక్క ప్రతినిధులు ఇంకా ఇతర నిషేదిత సంస్థలతో సంబంధాలు పెట్టుకుని, సామాజిక సేవ పేరుతో ఉగ్రవాద (జిహాది) కార్యాకలాపాలను సాగిస్తున్నారని, యువతను ఉగ్రవాదులుగా చేస్తున్నారన్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also: