Tirumala- బ్రహ్మోత్సవాల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు విస్తృతంగా కల్పించాలని, ఎప్పటికప్పుడు అవసరమైన సేవలు అందించాలని అనిల్కుమార్ సింఘాల్ (Anil Kumar Singhal)అధికారులకు నిర్దేశం చేశారు. బ్రహ్మోత్సవాల సమయంలో మాఢవీధుల్లో పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామని, ఇందుకు అవసరమైన సిబ్బందిని అదనంగా డిప్యూటేషన్‌పై నియమించుకోవాలని సూచించారు. సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, అధికారుల సేవలపై గురువారం రాత్రి తిరుమల అన్నమయ్య భవనంలో అత్యవసర సమావేశం నిర్వహించారు.

అధికారుల సమీక్ష సమావేశం
టిటిడి అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్య చౌదరి, సివిఎసి మురళీకృష్ణ, సిఇ సత్యనారాయణ, ఆలయ డిప్యూటీ ఇఒ లోకనాథం, డిఎపి ఫణికుమార్నాయుడు, సిపిఆర్‌ఒ డాక్టర్ తలారి రవితో కలసి ఇఒ సింఘాల్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన మేరకు తిరుమలలో పార్కింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుపతిలోనూ పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు.
భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
గ్యాలరీల్లోని భక్తులకు(Devotees in the galleries) ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నప్రసాదాలు పంపిణీ చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ఉండాలన్నారు. సెప్టెంబర్ 24వ తేదీ నుండి అక్టోబర్ 2 వరకు జరిగే బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలకు వస్తున్నారని, ఏర్పాట్లు మరింత పటిష్టంగా చేపట్టాలని అధికారులకు సూచించారు.
బ్రహ్మోత్సవాల్లో అనిల్కుమార్ సింఘాల్ ఏ అంశంపై ఎక్కువ దృష్టి పెట్టారు?
మాఢవీధుల్లో పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
బ్రహ్మోత్సవాలు ఎప్పుడు జరుగనున్నాయి?
సెప్టెంబర్ 24వ తేదీ నుండి అక్టోబర్ 2 వరకు జరుగుతాయి.
Read hindi news: hindi.vaartha.com
Read also: Indo-America-మా స్నేహం చిరకాలమైనది..మార్కో రూబియో