ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, నగరి వైసీపీ నేత ఆర్.కే. రోజా (Roja) బుధవారం ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. తనపై నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు తీవ్రంగా తగిలాయని అన్నారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినా, వ్యక్తిగత జీవితంపై అర్ధన్గత ఆరోపణలు తీవ్రంగా కలచివేస్తాయని పేర్కొన్నారు.
మార్ఫింగ్ ఘటనను గుర్తు చేసుకున్న రోజా
టీవీ చర్చలో రోజా గతంలో తనకు ఎదురైన ఓ బాధాకర సంఘటనను వివరించారు. “నా కూతురి ఫొటోలు, అలాగే నేను, నా కొడుకుతో అప్యాయంగా ఉన్న ఫోటోల్ని న్యూడుగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆ దృశ్యాలను చూసినప్పుడు నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నా. ఆ స్థితిలో నా కుటుంబం, నా ఆత్మవిశ్వాసమే నాకు అండగా నిలిచాయి,” అంటూ బోరున ఏడ్చారు. ఇలాంటి పని చేసినవారి పట్ల చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
లోకేష్, చంద్రబాబు పైన తీవ్ర ఆరోపణలు
రోజా మాట్లాడుతూ, తనపై జరిగిన దుష్ప్రచారాలకు టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ బాధ్యత వహించాలన్నారు. “వారు ఇలా చేయించకుండా ఉంటే ఎవ్వరూ ఇంత దారుణంగా ప్రవర్తించరు. ఇవన్నీ రాజకీయాల్లో వ్యక్తిగతంగా నన్ను కించపరచే కుట్రలే,” అని ఆవేదన వ్యక్తం చేశారు. చివరగా, ప్రతి మహిళా నాయకురాలిని గౌరవించాల్సిన అవసరం ఉందని, రాజకీయ విభేదాలు ఎంత ఉన్నా మర్యాదలు మరిచిపోవద్దని విజ్ఞప్తి చేశారు.
Read Also : http://Hydraa : హైదరాబాద్లో వర్షం.. బోట్లలో ప్రజల తరలింపు