కర్ణాటకలో(Karnataka) ఘోర రోడ్డు ప్రమాదం (road accident) చోటుచేసుకుంది. రాయచూరు జిల్లా సింధనూరు తాలూకా కన్నారి క్రాస్ వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. వీరిలో ఐదుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. సింధనూరు సిరుగుప్ప మార్గంలోని కన్నారి క్రాస్ వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బొలేరో వాహనాలు బలంగా ఢీకొని ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం తర్వాత వాహనాల వేగానికి మృతదేహాలు నడి రోడ్డుపై విసిరేసినట్లు చెల్లాచెదురుగా పడిపోయాయని స్థానికులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని కుంటనహాల్, మదిరె గ్రామాలకు చెందిన వారితో పాటుగా సిరుగుప్ప తాలూకాలోని చెళ్లకుడ్లూరు వాసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Read Also: JimMurray WhiskyBible:విస్కీలకు ర్యాంకులు! లిస్ట్‌లో ఇండియన్ బ్రాండ్!!
ఈ ప్రమాదంలో కర్నూలు జిల్లా మదిరెకు చెందిన ఎరుకల మల్లయ్య, కుంటనహాల్ మల్లయ్య, గుడికంబాలి గిరి అనే ముగ్గురు వ్యక్తులు చనిోపోయినట్లు పోలీసులు గుర్తించారు. (road accident) వీరంతా సోమవారం రాత్రి గొర్రెల కోసం సింధనూరుకు బయల్దేరి వెళ్లారు. మంగళవారం రోజు ఉదయం గొర్రెలు కొనుగోలు చేశారు. అనంతరం గొర్రెలను బొలెరో వాహనంలో తీసుకుని సొంతూర్లకు తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే బొలెరో వాహనం రిపేర్ కావటంతో.. అక్కడే ఆగిపోయారు. బొలెరో వాహనాన్నిబాగు చేయించుకొని మంగళవారం సాయంత్రం 6 గంటలకు సొంతూర్లకు బయలుదేరారు. అయితే రాత్రికల్లా ఊర్లకు చేరుకుంటామనగా ఘోరం చోటుచేసుకుంది.

బయల్దేరిన కాసేపటికే కన్నారి క్రాస్ వద్ద వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో బొలెరో బలంగా ఢీకొట్టింది. రహదారిపై రెండు వాహనాలు ఒక వైపే వేగంగా రావటంతో పరస్పరం బలంగా ఢీకొన్నాయి. రహదారిపై ఓవైపు కొత్త రోడ్డు ఉండగా.. మరోవైపు గోతులమయంగా ఉంది. దీంతో ఇద్దరు డ్రైవర్లు ఒకేవైపు వేగంగా వచ్చారు. దీంతో రెండు వాహనాలు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడు మంది చనిపోయారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: