చిన్న అడుగులే భారీ లక్ష్యాల సాధనకు తోడ్పా టునందిస్తాయని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత అభిజీత్ బెనర్జీ చెప్పిన భాష్యా లు నూటికి నూరు పాళ్లూ నిజం. గమ్యం లేకుండా గమనం ఉండదు. అందుకే తెలంగాణ ప్రభుత్వం 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను(Rising Global Summit) నిర్వహించింది. ఎందరో పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలు వచ్చి దీవించి వెళ్లారు. భాగస్వాములవ్వాలని ఆశించారు. నోబెల్ గ్రహీతలు సైతం వారికున్న విశేషా నుభవం, విశ్లేషణా సామర్థ్యంతో తెలంగాణ సదస్సు ముందుంచిన భవిష్యత్ ప్రణాళికలను, ఆర్థిక ప్రగతి పనంతాలను క్రోడీకరించారు. తెలంగాణ వెలిగిపోవడం ఖాయమనే నమ్మకాన్ని వెలిబుచ్చి వెళ్లారు. ఇకపై తెలం గాణ ప్రభుత్వం వేసే ప్రతి అడుగూ, చేసే ఆలోచనల రేపటి తెలంగాణ’ కోసమేనని తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేయ డాన్ని బట్టి తెలంగాణ నేటి గమనం- రేపటి గమ్య స్థానంపై స్పష్టమైన అవగాహనలోనే ప్రణాళికలు ఏర్పాటు చేసినట్లు ద్యోతకమవుతోంది. బుడిబుడి అడుగులు లేకుండానే అమాంతం అభివృద్ధిని ‘ఫ్యూచర్ సిటీ’ (Future City) వైపు నుంచే కేంద్రీకృతం చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆలోచనను ఎంతో మంది ప్రశంసించారు. తెలంగాణ అభివృద్ధిని, పారిశ్రామిక ప్రగతిని కాంక్షిస్తూ బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ శుభాకాంక్షలు అందచేసారు. సమ్మిట్లో (Rising Global Summit )ఆర్థిక, సమ్మిళిత, సుస్థిరవృద్ధి దిశగా ముందడుగు వేసి, భావితరాల కోసం తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ డాక్యుమెంట్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఆతర్వాత సమ్మిట్కు హాజరైన ఆహూతులు, పారిశ్రామిక వేత్తలు, సెలబ్రిటీలు దార్శనిక పత్రంలోని అంశాలపై చర్చించారు. ‘తెలంగాణ మీన్స్ బిజినెస్’ నినాదంతో విడుదలచేసిన పత్రంలో వాంచించినట్లే తెలంగాణలో 5.75 లక్షల కోట్లు భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఎందరో పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. ఆశించిన మేరకు పరిశ్రమల స్థాపన జరిగితే లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇదొక తెలంగాణ ప్రాంత ఆశయాల వేదికగా పలువురు పేర్కొన్నారు. పదేళ్లలో ఒక ట్రిలియన్, 22 ఏళ్ల తర్వాత స్వాతంత్య్రం వచ్చి వందేళ్లయిన నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్లో ప్రముఖుల ప్రసంగాలు హైదరాబాద్ను శీఘ్రగతిన మరోస్థాయికి తీసుకెళ్లే విధంగా ఉన్నాయి. ఢిల్లీలో కాలుష్యం, బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలతో అక్కడి పరిశ్రమలు తరలిపోతున్నాయన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చిన మాజీ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ప్రొ. అరవింద్ సుబ్రహ్మణ్యం వాటన్నిటికీ హైదరాబాద్లో మంచి అవకాశాలున్నాయని తెలిపారు. ఆకాంక్షలు ఏ స్థాయిలో ఉన్నాఆచరణలో సమర్థవంతం గా కదిలితే లక్ష్య సాధన తేలికేనని పలువురు అభిప్రాయ పడ్డారు. సదస్సు తొలిరోజు 2 లక్షల 43 వేల కోట్ల మేరకు, రెండో రోజున మరింత ఆశాజనకంగా 3 లక్షల 32వేలకోట్ల పెట్టుబడులు సాధించడంలో ప్రభుత్వ ప్రణా ళిక విజయవంతమైనట్లే. పెట్టుకున్న లక్ష్యాలు ఆచరణలో కష్టతరమైనప్పటికీ అసాధ్యమేమీకాదంటూనే తెలంగాణ అన్పబులే కాదు అనీటబుల్ కూడా అని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తెలంగాణ అభివృద్ధిని కాంక్షించారు. రాష్ట్రంలో రూ.70వేల కోట్లతో 150 ఎకరాల్లో 1గిగావాట్ సామర్థ్యంతో డేటా పార్కు ఏర్పాటు చేయడానికి ఇన్ఫ్రాకీ పార్క్ ఒప్పందం కుదిరింది. జెసికె ఇన్ఫ్రా ప్రాజెక్ట్ రూ. 9వేల కోట్ల పెట్టుబడు లకు, పర్యాటన రంగంలో రూ.7,045 కోట్లు పెట్టుబ డులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి. ఎసిపి గ్రూపు మొత్తం రూ.6750తో 1 గిగావాట్ డేటా సెంటర్కు పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేయగా, బయోలా జికల్-ఇ సంస్థ పరిశోధన అభివృద్ధి తయారీ విభాగాల్లో రూ.3,500 కోట్ల పెట్టుబడులు పెట్టాలని ప్రణాళిక వేసుకుంది. రూ.1100 కోట్లతో ప్రపంచంలోనే తొలి ప్లగ్ఇన్ హైబ్రిడ్ మోటార్ బైక్ కేంద్రేర్పాటు చేయనుంది. ఏమయితేనే హైదరాబాద్లో ప్యూచర్ సిటీ వినూత్నంగా రూపుదిద్దుకోనుంది. ఈ ప్రతిపాదనలన్నీ దిగ్గజ పారిశ్రా మికవేత్తల నుంచే రావడం ఒక శుభసూచికం. అన్ని వర్గా లకు అభివృద్ధి ఫలాలు దకా ్కలనే ఆశయంతో రూపొం దించిన దార్శనిక పత్రంలో ప్రజల ఆకాంక్షలన్నీ పొందు పరిచారు. తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ను ఐఎస్బి, నీతి ఆయోగ్ సహకారంతో మేధావులచే రూపొందించ డంతో విశిష్టత పొందింది. మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి వైవి ధ్యమైన అంశాలను క్రోడీకరించారు. పైగా చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ అభివృద్ధిలో చోటుచేసుకున్న అంశాలను కూడా చర్చించారు. అదే మోడల్ లో ముందు కెళ్లాలని ముఖ్యమంత్రినిర్ణయించారు. ఇప్పటికే హైదరా బాద్ నగరం ఐటి, బయోసైన్సెస్, వంటి రంగాల్లో అప్రతి హాత అభివృద్ధి సాధించింది. ఈ తరుణంలో వాటి అను బంధరంగాలకు కూడా ప్రోత్సహించాల్సినఅవశ్యకత ఉం దని గుర్తించింది. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ రూపకల్పన దిశగా వికసిత్ భారత్’ లక్ష్య సాధనతోప్రధాని నరేంద్రమోడీ ముందుకు వెళ్తుండగా అందులో పదోవంతు హైదరాబాద్ అభివృద్ధికి దోహదపడే దార్శనిక పత్రాన్ని ప్రతిపాదించడం తెలంగా ణ పాలకుల విజన్ను తెలియచేస్తోంది. తెలంగాణ ఆత్మ విశ్వాసాన్ని ఈ సమ్మిట్ ప్రతిబింబింప చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: