Rajahmundry Milk Case: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన రాజమండ్రి కల్తీ పాల మరణాల కేసులో ఎట్టకేలకు ఒక స్పష్టత వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL), రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (RFSL) నివేదికలు శనివారం విడుదలయ్యాయి. మొత్తం 10 మంది మరణించారు.
Read Also: Firing : ఏపీ పోలీసులపై తెలంగాణ వ్యక్తి కాల్పులకు యత్నం
పాలల్లో ప్రమాదకర రసాయనం: ‘ఇథైలిన్ గ్లైకాల్’ గుర్తింపు
అయితే అందులో ఐదుగురి మరణాలకు సంబంధించిన ఎఫ్ఎస్ఎల్, ఆర్ఎఫ్ఎస్ఎస్ ల్యాబ్ నివేదికలు వచ్చాయి. ఈ వివరాలను అధికారులు శనివారం రోజున వెల్లడించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ప్రకారం.. రాజమండ్రిలో పాల వ్యాపారి ఇళ్లకు పోసిన పాలల్లో ఇథైలిన్ గ్లైకాల్ అనే ప్రమాదకర రసాయనం కలిసినట్లు తేలింది. ఈ కెమికల్ కలిసిన పాలను తాగడం వలనే కిడ్నీలు దెబ్బతిని బాధితులు చనిపోయినట్లు నివేదిక తేల్చినట్లు అధికారులు తెలిపారు.

పాల వ్యాపారి గణేష్ వరలక్ష్మి డైరీ పేరుతో పాలకేంద్రం నిర్వహిస్తున్నారు. అయితే పాలకేంద్రంలో పాలను నిలువ ఉంచేందుకు ఓ ఫ్రీజర్ ఉపయోగించేవారు. అయితే ఫ్రీజర్ లీక్ అవుతూ ఉండటంతో.. గణేష్ లీక్ అయ్యే ప్రాంతంలో ఎంసీల్ అతికించినట్లు తెలిసింది. ఫిబ్రవరి 15వ తేదీన గణేష్.. రోజూలాగానే పలువురికి పాలు పోశారు. అయితే పాలు చేదుగా ఉన్నాయని ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి.
అయితే గణేష్ వాటిని పట్టించుకోనట్లు తెలిసింది. అంతేకాకుండా అవే పాలను మరుసటి రోజు రాజమండ్రిలోని పలు ఇళ్లకు సరఫరా చేశారు. అయితే ఫ్రీజర్ నుంచి లీక్ అయిన కెమికల్స్ పాలల్లో కలిసి విషపూరితంగా మారినట్లు తెలిసింది.ఫ్రీజర్‌లో ఉన్న పదార్థాలను అధికారులు పరీక్షించటంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: