ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు సక్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, వచ్చే మూడు రోజులు వర్షాల కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలపై నైరుతి మేఘాల ప్రభావం ప్రారంభమై, పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు ఇంకా మూడు రోజులు కొనసాగనున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

రుతుపవనాల ప్రభావం ఏమిటి?
నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ ప్రారంభం నుండి దేశంలోని పెద్దభాగంలో వర్షాలను తీసుకువస్తాయి. ప్రస్తుతం ఈ గాలులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా చురుగ్గా ప్రవహిస్తున్నాయి. వీటి వలన తేమ గాలులు రాష్ట్రంలోకి ప్రవేశించి వర్షాలుకు కారణమవుతున్నాయి.
ప్రాంతాల వారీగా వాతావరణ సూచన:
ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఆంధ్ర ప్రదేశ్ – యానంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి – పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.
మంగళవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
బుధవారం, గురువారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
రాయలసీమ:
మంగళవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
బుధవారం & గురువారం: ఉరుములతో కూడిన వర్షాలు, మెరుపులు, బలమైన గాలులు కొనసాగే సూచనలు. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచవచ్చును. తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది.
Read also: Anagani Satya Prasad: మీ తప్పులను సరిదిద్దుకోండి : మంత్రి అనగాని