हिन्दी | Epaper

Rain Alert: ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు..అలర్ట్ అయిన ప్రభుత్వం

Sharanya
Rain Alert: ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు..అలర్ట్ అయిన ప్రభుత్వం

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) రాష్ట్రం అసాధారణ వాతావరణ పరిణామాలను ఎదుర్కొంటోంది. మే 16 రాత్రి నుండి పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు, ఈదురు గాలులు, పిడుగుల ముప్పుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విశేషంగా కోస్తా ఆంధ్ర ప్రాంతంలో పలు చోట్ల చెట్లు కిందపడి రహదారులు అడ్డుపడినప్పటికీ, అధికార యంత్రాంగం వెంటనే స్పందించి రోడ్డులను క్లియర్ చేసే ప్రయత్నాలు చేపట్టింది. విద్యుత్ సరఫరాలో అంతరాయమొచ్చిన చాలా చోట్ల ఇప్పటికే మరమ్మత్తులు కొనసాగుతున్నాయి. రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.

Rain Alert
Rain Alert

విభిన్న వాతావరణ పరిస్థితులు

గురువారం తెల్లవారుజాము వరకు 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ, మధ్యాహ్నానికి మబ్బులు కమ్ముకున్నాయి. కాసేపు మబ్బులు, కాసేపు వడగాలులు, కాసేపు ఆక స్మికంగా పిడుగులతో కూడిన వర్షాలు, ఈదురుగాలుతో వాతావరణం దోబూచులాడింది. రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. మరికొన్ని చోట్ల మోస్తరు వాన లు కురిశాయి. అండమాన్‌లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతోపాటు, ఆంధ్రప్రదేశ్‌లో వాయువ్య, నైరుతి దిశగా వీస్తున్న గాలుల వల్ల ఈ భిన్న వాతావరణం ఏర్పడినట్లు నిపుణులు చెబుతున్నారు. వాతావరణంలోని అనూహ్య మార్పుల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

రుతుపవనాల సంకేతాలు ముందుగానే?

అండమాన్ నికోబార్ ద్వీపాలలో నైరుతి రుతుపవనాలు ఇప్పటికే చురుగ్గా కదులుతున్నాయి. ఇక, ఈ నెల 27న కేరళను రుతుపవనాలు తాకనుండగా జూన్ 5 నాటికి ఏపీలో ప్రవేశిస్తాయని అంచనాగా వెల్లడించారు. వచ్చే నెల మొదటి వారం నాటికి నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్నాయి. జూన్‌ 5 నాటికి రాయలసీమ, దక్షిణ కోస్తాలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్‌ 10 నాటికి ఉత్తరాంధ్ర సహా రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

జిల్లా వారీగా వర్ష సూచనలు

రెండు రోజులు అలర్ట్ , ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకా పల్లి, కాకినాడ, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల 50 నుంచి 60 కి.మీ వేగంతో ఈదురు గాలులు, పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు పడేందుకు అవకాశం ఉంది.

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు వచ్చే జిల్లాలు:

శ్రీకాకుళం, విజయ నగరం, గుంటూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, శ్రీసత్యసాయి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీసత్యసాయి జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వాతావరణ మార్పులు వ్యవసాయరంగానికే కాదు, విద్యుత్ సరఫరా, రవాణా, ఆరోగ్య రంగాలపై ప్రభావం చూపే అవకాశముంది. పలు జిల్లాల్లో విద్యుత్ సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమై సహాయ చర్యలు చేపట్టింది.

Read also: IMD : ఏపీలో నైరుతి రుతుపవనాల ఎంట్రీపై ఐఎండీ ఏమంటుందంటే

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ సులభం

ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ సులభం

నిరుద్యోగులకు శుభవార్త.. ఉగాది రోజున ఏపీ జాబ్ క్యాలెండర్!

నిరుద్యోగులకు శుభవార్త.. ఉగాది రోజున ఏపీ జాబ్ క్యాలెండర్!

📢 For Advertisement Booking: 98481 12870