हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Rain Alert: ద్రోణి ప్రభావంతో ఆంధ్రకు 3 రోజులు వర్షాలు

Sharanya
Rain Alert: ద్రోణి ప్రభావంతో ఆంధ్రకు 3 రోజులు వర్షాలు

ప్రస్తుతం భారతదేశం మీదుగా కొనసాగుతున్న ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇది ప్రస్తుతం ప్రజల జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితిని కలిగిస్తోంది.

Rain Alert:
Rain Alert:

ప్రస్తుత ద్రోణి, తెలంగాణ నుంచి తూర్పు మన్నారు గల్ఫ్‌ ప్రాంతం వరకూ కొనసాగుతూ, రాయలసీమ, దక్షిణ తెలంగాణ, తమిళనాడు మీదుగా వెళ్తోంది. ఇది సముద్రమట్టానికి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. దీనివల్ల మేఘాలు ఏర్పడి గాలి తేమ పరవాహనం జరగడం వల్ల వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈసారి నైరుతి రుతుపవనాలు మే 12వ తేదీకి దక్షిణ అండమాన్ సముద్ర ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.

ఏపీలో మూడు రోజుల వర్షాలు – ఏఏ జిల్లాల్లో ప్రభావం?

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం, నేడు, రేపు, ఎల్లుండి మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఉత్తర కోస్తాలో ఈరోజు, రేపు, ఎల్లుండి బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఈ ప్రాంతాలలో వర్షాలు జాగ్రత్త మరోవైపు దక్షిణ కోస్తాలో కూడా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ఇక్కడ కూడా గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నేడు అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

ఎండల తీవ్రత

ఎండల విషయంలోనూ అలెర్ట్ పిడుగుపాటు పట్ల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. పిడుగు సమయంలో బయట ఉండరాదు, మొబైల్ ఫోన్ వాడకూడదు, చెట్ల కింద నిలవకూడదు. ఇక కొన్ని ప్రాంతాలలో ఎండ తీవ్రత పెరుగుతుందని 42 డిగ్రీల నుండి 43.5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ఎండల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మధ్యాహ్న సమయంలో బయటికి వెళ్లే వారు శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవడం, కూలింగ్ ఉపకరణాలు ఉపయోగించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

Read also: Andhra Pradesh: అమరావతి పలు అభివృద్ధి కార్యక్రమాలపై నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870