हिन्दी | Epaper

Raghurama Krishnaraju: జగన్ తో విభేదించడం వల్ల మనస్పర్థలు వచ్చాయి :రఘురామకృష్ణరాజు

Sharanya
Raghurama Krishnaraju: జగన్ తో విభేదించడం వల్ల మనస్పర్థలు వచ్చాయి :రఘురామకృష్ణరాజు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా ఎన్నికై, అదే పార్టీ అధినేత అయిన జగన్‌ మోహన్ రెడ్డిపై బహిరంగంగానే విమర్శలు చేసిన మొదటి నాయకుడిగా చరిత్రలో నిలిచారు ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. వైసీపీలోనే ఉంటూ జగన్ పై, ఆ పార్టీలోని కీలక నేతలపై యుద్ధమే చేశారు. తాజాగా ఓ కార్యక్రమంలో రఘురామ మాట్లాడుతూ జగన్ తో తనకు విభేదాలు ఎందుకొచ్చాయో వెల్లడించారు.

వైసీపీలోనే ఉండి జగన్‌ను ప్రశ్నించాను – రఘురామ

తాజాగా పాల్నాడు జిల్లా రాజుపాలెం మండలం బలిజేపల్లిలో నిర్వహించిన ఎన్టీఆర్‌, కోడెల శివప్రసాద్‌ల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రఘురామ అక్కడ తన రాజకీయ ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావుపై వైసీపీ నాయకులు చులకనగా మాట్లాడేవారని అలా మాట్లాడటాన్ని తాను విభేదించడం వల్ల జగన్ తో తనకు తొలుత మనస్పర్థలు వచ్చాయని రఘురామ తెలిపారు. ఆ తర్వాత విభేదాలు ముదిరాయని చెప్పారు. తాను రాజకీయాల్లోకి వస్తానని కలలో కూడా ఊహించలేదని తాను రాజకీయాల్లోకి రాకముందే ఎంతో మందికి ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎంపీ గుంటూరు నియోజకవర్గానికి చెందిన కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడెల శివరామ్ తదితరులు పాల్గొన్నారు.

Read also: TTD: తిరుమలలో ఆకస్మిక తనిఖీలను నిర్వహించిన టీటీడీ ఛైర్మన్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ సులభం

ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ సులభం

నిరుద్యోగులకు శుభవార్త.. ఉగాది రోజున ఏపీ జాబ్ క్యాలెండర్!

నిరుద్యోగులకు శుభవార్త.. ఉగాది రోజున ఏపీ జాబ్ క్యాలెండర్!

మహిళల జోలికొస్తే ఖబడ్డార్.. నేరగాళ్లపై డ్రోన్ నిఘా!

మహిళల జోలికొస్తే ఖబడ్డార్.. నేరగాళ్లపై డ్రోన్ నిఘా!

ఆరు నెలల్లో స్థానిక ఎన్నికలు: మంత్రులకు సీఎం చంద్రబాబు క్లారిటీ!

ఆరు నెలల్లో స్థానిక ఎన్నికలు: మంత్రులకు సీఎం చంద్రబాబు క్లారిటీ!

పెద్ద దిక్కును కోల్పోయిన జర్జంగి

పెద్ద దిక్కును కోల్పోయిన జర్జంగి

బీసీ రక్షణ చట్టంపై నేడు కీలక సమావేశం

బీసీ రక్షణ చట్టంపై నేడు కీలక సమావేశం

పలాస కేంద్రీయ విద్యాలయలో తరగతులు షురూ!

పలాస కేంద్రీయ విద్యాలయలో తరగతులు షురూ!

పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. నిమిషం నిబంధన రద్దు!

పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. నిమిషం నిబంధన రద్దు!

దేశంలోనే తొలి ఏఐ క్యాంపస్: బిట్స్ పిలానీ భారీ ప్రణాళిక!

దేశంలోనే తొలి ఏఐ క్యాంపస్: బిట్స్ పిలానీ భారీ ప్రణాళిక!

అంగన్వాడీ ఆయాలకు గుడ్ న్యూస్ తెలిపిన ఏపీ సర్కార్

అంగన్వాడీ ఆయాలకు గుడ్ న్యూస్ తెలిపిన ఏపీ సర్కార్

📢 For Advertisement Booking: 98481 12870