ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు వివిధ కారణాల వల్ల వలస వెళ్తుంటారు. ఈ వలసలు వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి గానీ, జీవితాన్ని కాపాడుకోవడానికి గానీ జరుగుతుంటాయి. ఇలాంటి
వలస దారుల (immigrants)హక్కులను గుర్తించడం, వారి కష్టాలను అర్థం చేసుకోవడం, వారికి సహాయం చేయడం కోసం అంతర్జా తీయ వలసదారుల దినోత్సవం ప్రతి సంవత్సరండిసెంబర్ 18న జరుపుకుంటారు. డిసెంబర్18ను అంతర్జాతీయ వలసదారుల దినోత్సవంగా 2000లో ఐక్యరాజ్యసమితి ప్రధాన అసెంబ్లీ ప్రకటించింది. 1990లో ఇదే తేదీన అంతర్జాతీయ వలసదారుల హక్కుల పరిరక్షణకు సంబం ధించిన కన్వెన్షన్ఆ మోదించబడింది. ఈ నేపథ్యంతో వలస దారుల (immigrants)హక్కులను, వారితో ఉన్న సమస్యలను చర్చించేం దుకు ఈ రోజు గుర్తింపును పొందింది. తక్కువ ఉపాధి అవకాశాలు, దారిద్య్రం వలన వేలాది మంది మెరుగైన జీవనోపాధి కోసం వలస వెళ్లాల్సి వస్తుంది. వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు (ఎడతెరిపి లేని వరదలు, కరువులు, అగ్నిపాతాలు) ప్రజలను వలసలకు బలవంతం చేస్తాయి. కొంతమంది జీవితం కోసంశరణార్థులుగా వలస వెళ్తే, మరికొందరు భద్రత కోసం కొత్త ప్రాంతాలను ఆశ్రయి స్తారు. అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన విద్య, నైపుణ్యా భివృద్ధి కోసం యువత వలసలు చెయ్యటం సర్వసాధా రణం. వలసదారులు వారి కృషితో అతిధి దేశాలకు ఆర్థికంగా విశేష ప్రయోజనం కలిగిస్తారు. రెమిటెన్సుల రూపంలో స్వదేశాలకు పెద్ద మొత్తంలో ఆర్థిక మద్దతును అందిస్తారు. వారి సాంస్కృతిక సంపదతో కొత్త ప్రాంతా లను సుసంపన్నం చేస్తారు. సంగీతం, భాష, ఆహారపు అలవాట్లు వంటి అంశాల్లో కొత్త మార్పులను తీసుకురావ డంలో వీరు కీలక పాత్ర పోషిస్తారు. వలసదారులు వారి మేధస్సు, సాంకేతిక నైపుణ్యాలను అతిధి దేశాలకు అందించడంతో పాటు స్థానిక సమాజ అభివృద్ధికి తోడ్పడతారు.
Read Also: http://Delhi air pollution : పోల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే ఇంధనం లేదు.. పాత వాహనాలకు ఎంట్రీ బ్యాన్…

వలస దారులు తరచూ వివక్షకు గురవుతుంటారు. తక్కువ వేతనాలు, నిస్సహాయ పరిస్థితులు, చట్టపరమైన రక్షణల లోపం కారణంగా వారు తీవ్రకష్టాలను అనుభవిస్తున్నారు. భాషా, ధార్మిక భిన్నత్వాలు వలసదారులను ఒంటరితనానికి గురిచేస్తాయి. అనేక దేశాలు వలసదారుల హక్కులను పరి గణలోకి తీసుకోవడం లేదా వారి అవసరాలను సరైన విధంగా సమర్థించడం లేదని విమర్శలు వస్తున్నాయి. కొన్ని సార్లు వలస దారులు స్థిరమైన ఉపాధి లేకుండా ఆర్థిక అనిశ్చితిలో చిక్కుకుపోతున్నారు. భారతదేశం ప్రాచీన కాలం నుండి వలసదారులను స్వీకరించే సంప్రదాయాన్ని కలిగి ఉంది. ఉపాధి కోసం కార్మిక వలసలు ఎక్కువగా కనిపిస్తు న్నాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వలసపోయే భారతీ యుల సంఖ్య గణనీయంగా ఉంది. వీరు భారతీయ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైన విదేశీ మారక ద్రవ్యాన్ని తెస్తున్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అరుణాచల ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలనుండి వచ్చిన శరణార్థులు భారత ప్రభుత్వం ద్వారా మద్దతు పొందుతున్నారు.వలసదారుల కష్టాలను సమాజం గుర్తించడం, వారిపై ఉన్న అపనమ్మకా ల్ని తొలగించడం ఈదినోత్సవం ప్రధాన లక్ష్యం. వలసదారు ల రక్షణ, హక్కులకోసం అంతర్జాతీయ స్థాయిలో పటిష్ట మైన విధానాలను రూపొందించేందుకు ఇది ప్రేరణగా పని చేస్తుంది. వలసదారులు స్థానిక సమాజంలో సమగ్ర పరచ బడేందుకు అవసరమైన చర్యలను ప్రోత్సహించడానికి ఈ రోజు దోహదపడుతుంది. వలసదారులు ప్రపంచ ఆర్థిక, సాంస్కృతిక, సామాజికరంగాలకు ఎంతగానో తోడ్పడుతున్నారు. వారి కృషిని గౌరవించడం మన కర్తవ్యం. అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం ఈ అంశంపై మరింత అవగాహన కలిగించి, వారి హక్కులకు శ్రద్ధవహించే దిశగా సమాజాన్ని ప్రోత్సహిస్తుంది. వలసదారులను అర్థంచేసుకుని, వారికి సహ కరించడం మన సామూహిక బాధ్యత.
-రామ కిష్టయ్య సంగన భట్ల
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: