ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు (Kurnool) జిల్లా మరోసారి విషాదంలో మునిగిపోయింది. శుక్రవారం తెల్లవారుజామున కల్లూరు మండలం ఉల్లిందకొండ సమీపంలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఒక ప్రైవేట్ వోల్వో బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Kurnool Crime: కర్నూలు బస్సు ప్రమాదం పై ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి
క్షణాల్లోనే ఆ మంటలు బస్సు మొత్తం వ్యాపించడంతో 20 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు.సుమారు 19 మంది ప్రయాణికులు బస్సు అత్యవసర ద్వారం పగలగొట్టుకుని బయటపడటంతో స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు.

ప్రధాని మోదీ విచారం
ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ (Prime Minister Modi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం అత్యంత బాధాకరం. ఈ కష్ట సమయంలో బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని ప్రధాని కార్యాలయం (పీఎంఓ) ఎక్స్ వేదికగా పేర్కొంది.
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్‌ఎఫ్) నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: