కోవూరు శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
జిఎస్టి 2.0 వల్ల రవాణా ఖర్చులు తగ్గి నిత్యావసరాల
బుచ్చి (నెల్లూరు) : జిఎస్టి 2.0 సంస్కరణలతో వస్తు రవాణాలో కీలక పాత్ర పోషించే వాహనాల కోనుగోలు, మెయింటెన్స్ కాస్టు తగ్గడంతో సరుకుల రవాణా ఖర్చులు తగ్గి నిత్యావసర సరుకుల ధరలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు. బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలోని కెవిఆర్ కళ్యాణ మండపంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిఎస్టి అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని వినియోగ వస్తువుల ధరలు పెరగడం తగ్గడంలో రవాణా రంగ పాత్ర గురించి ఆమె(Prashanthi Reddy) గణాంకాలతో సహా వివరించారు. జిఎస్టి (GST) 2.0 సంస్కరణలు లాజిస్టిక్ రంగానికి వరం లాంటివన్నారు. జిఎస్టి 2.0 సంస్కరణలతో ట్రాక్టర్లు తగ్గడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. రెండవ ట్రాక్టర్ కొనేందుకు ఆసక్తి చూపుతున్నారని స్పష్టం చేశారు. ట్రాన్స్ పోర్టు వాహనాల ఇన్సూరెన్స్ పై గతంలో ఉన్న 18% శాతం జిఎస్టిని 05% శాతానికి తగ్గించడం శుభపరిణామమని అన్నారు.
Read also: డబుల్ డెక్కర్ వంతెనలకు బ్రేక్.. నిర్వహణ ఖర్చులే కారణమా?

ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్పష్టం
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీకి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి ఆమె (Prashanthi Reddy) ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళీ, కమర్షియల్ ట్యాక్స్ అసిస్టెంట్ కమీషనర్ సుజాత, జిల్లా రవాణాశాఖ అధికారి కార్తీక్, బ్రేక్ ఇన్స్పెక్టర్ సంధ్య, బ్రేక్ ఇన్స్పెక్టర్ స్వప్నిల్రెడ్డి, వవ్వేరు బ్యాంకు చైర్మన్ దొడ్ల విజయలక్ష్మి, బుచ్చి రూరల్ బ్యాంకు చైర్మన్ ఏటూరు శివరామకృష్ణారెడ్డి, నగర అధ్యక్షుడు గుత్తా శ్రీనివాసులు, వైస్ చైర్మన్ యరటపల్లి శివకుమార్రెడ్డి, వైస్ చైర్పర్సన్ పఠాన్ నస్రీన్, రూరల్ అధ్యక్షుడు జగదీష్, వింజం రామానాయుడు, తాళ్ళ నరసింహస్వామి, కౌన్సిలర్ తాళ్ళ వైష్ణవి, మైనార్టీ నాయకులు పఠాన్ మహబూబాషా, షబ్బీర్, షేక్, ఫర్వీనా, వల్లూరు రాఘవరెడ్డి, వల్లూరు శ్రీనివాసులు, కౌన్సిలర్ రాచూరు సత్యనారాయణ, రహమత్, జనసేన నాయకులు చప్పిడి శ్రీనివాసులురెడ్డి, మాధవ్, బిజెపి నాయకులు కాసా శ్రీనివాసులు, నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: