అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు భావోద్వేగ స్పందన
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి(AP) నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మంగళగిరిలోని ఏపీఎస్పీ బటాలియన్ గ్రౌండ్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమ ప్రారంభంలో భద్రతా దళాల గౌరవ వందనాన్ని స్వీకరించిన ముఖ్యమంత్రి, అనంతరం అమరవీరుల స్మారక స్థూపానికి పుష్పగుచ్ఛం సమర్పించి నివాళులు అర్పించారు. పోలీసుల సేవలు ప్రజల రక్షణకు అత్యంత కీలకమని, దేశం కోసం ప్రాణాలర్పించే వారి త్యాగం చిరస్మరణీయమని ఆయన అభిప్రాయపడ్డారు.
బీపీ కంట్రోల్లో ఉండాలంటే..ఏంచేయాలంటే !!!

శాంతి లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు ముఖ్యమంత్రి స్పష్టీకరణ
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. “రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆహ్వానం శాంతి భద్రతల మీద ఆధారపడి ఉంటాయి. నేర నియంత్రణ విషయంలో నేను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడను,” అని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ (AP) పోలీసులు దేశవ్యాప్తంగా విశ్వసనీయత కలిగిన బ్రాండ్‌గా ఎదిగారని పేర్కొన్నారు. రౌడీయిజం, నక్సలిజం, ఫ్యాక్షనిజంపై పోరాటం ద్వారా పోలీసులు తమ ప్రతిష్టను మరింత పెంచారని తెలిపారు. సమకాలీన నేరాల గురించి మాట్లాడుతూ, సైబర్ నేరాలు, వైట్ కాలర్ క్రైమ్స్ పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. ప్రతి 55 కిలోమీటర్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. డ్రగ్స్, గంజాయి, ఎర్రచందనం మాఫియాలపై గట్టి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పోలీసింగ్‌లో మానవత్వం అవసరం. అదే సమయంలో నూతన మౌలిక సదుపాయాలతో, టెక్నాలజీతో అభివృద్ధి చెందాలి. నేరస్తులు ప్రస్తుతం మేధో నేరాలకు పాల్పడుతున్నారు. వారికి ముందుండే స్ట్రాటజీలు అవసరం, అని చంద్రబాబు అన్నారు.
గూగుల్ వైజాగ్‌లో పెట్టుబడులకు ముందుకొచ్చినదీ, రాష్ట్రంలోని శాంతి భద్రతల వాతావరణమేనని ఆయన తెలిపారు. “కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు, ఫేక్ ప్రచారాలు, రాజకీయ ముసుగులో నేరాలు పెరుగుతున్నాయి. వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి,” అని సీఎం హెచ్చరించారు. కార్యక్రమంలో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ప్రజాప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: