ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి, సాగు నీటి సరఫరాకు జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) మరోసారి వరదల ప్రభావానికి గురైంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి పెద్ద ఎత్తున వరద ప్రవాహం చేరి, ప్రాజెక్టులోని కాఫర్ డ్యాం (Coffer Dam) పాక్షికంగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. వరద ఉద్ధృతికి కాఫర్ డ్యాంలో కొంత భాగం కోతకు గురైనట్లు సమాచారం.

ఎగువ కాఫర్ డ్యాం దెబ్బతిన్న పరిస్థితి
వివరాల ప్రకారం, ఎడతెరిపి లేని వర్షాల వల్ల గోదావరిలో వరద ఉద్ధృతి (Floods rise in Godavari) పెరగడంతో, ఎగువ కాఫర్ డ్యాంకు సుమారు 10 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతులో భాగం దెబ్బతిన్నట్లు సమాచారం. ఈ కారణంగా డ్యాం నిర్మాణం మరింత నష్టపోవచ్చని ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదే సమస్య మళ్లీ పునరావృతం
ఇది పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) వద్ద కాఫర్ డ్యాం మొదటిసారి దెబ్బతిన్న ఘటన కాదు. ఇప్పటికే 2022 ఆగస్టు నెలలో భారీ వరదల కారణంగా ఇదే తరహాలో కాఫర్ డ్యాం దెబ్బతిన్న విషయం గుర్తు చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్లీ అదే సమస్య రావడంతో స్థానిక ప్రజలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల చర్యలు
వరద ప్రవాహం నిరంతరంగా కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి, తక్షణమే రిపేర్లు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పరిస్థితి మరింత తీవ్రంగా మారకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ యంత్రాంగం స్పష్టం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: