ప్రభుత్వంలో ఒక భాగమైన పోలీసు వ్యవస్థ ప్రస్తుతం నాలుగు రోడ్ల కూడలిలో దిక్కుతోచకఉందా అన్న భావన ప్రజల్లో కలుగుతున్న దాని చాలా మంది భావిస్తున్నారు. ప్రభుత్వంలోని ఇతర విభాగాలు కూడా ఉదాహరణకు, రెవెన్యూవ్యవస్థ, టాక్స్ లు వసూలు చేసే వ్యవస్థ వ్యవసాయానికి చెందిన వ్యవస్థ, అడవులకు సంబంధించిన, విజ్ఞానా న్ని ప్రసాదించే చదువుల వ్యవస్థల్లాం టివి నాలుగు కూడళ్ల మధ్యలేవా అని ప్రశ్నించే ఆలోచన ఎవరికైనా కలగొచ్చు. పోలీసు (The police)వ్యవస్థకు మాత్రమే ప్రత్యేకం గా ఎందుకీ ప్రస్తావన? అడుగుతే జవాబు మాత్రం ఒక్కటే. దాదాపు కొన్ని వ్యవస్థలకే పరిమితమైన విభిన్న బాధ్యత లతో పోలీసు శాఖ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాల్సిన అవ సరం ఉంది. కాబట్టి చట్టాలను అమలు చేసే అతి ముఖ్య మైన బాధ్యత ఆ శాఖకే ఉంది కాబట్టి. వ్యక్తిగత స్వేచ్ఛను అవసరం అనుకుంటే సంస్థల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కూడా కట్టడి చేసేఉద్యోగం, ప్రజాస్వామ్యపరంగా రాజ్యాంగ పరంగా ఆ శాఖకే సంక్రమించింది. కాబట్టి పోలీసు (The police) వ్యవస్థ పనితీరు భూతద్దంలో చూడకతప్పదు. ఆశాఖ వ్యవహార దక్షతనూ, పనితీరునూ జవాబుదారీతనాన్ని ప్రతి నిము షమూ ప్రశ్నించక తప్పదు. భూమితోపాటు మానవాళి ఈ ప్రపంచంలో భాగంగా ఉద్భవించి మమేకమై మొదట్లో సర్వ స్వతంత్రంగా గమనాన్ని సాగిస్తూ, తర్వాత తర్వాత చిన్నా భిన్నమైన సమూహాల నియంత్రణ, ధర్మం, న్యాయం, అవ సరమని అనుభవం ద్వారా గుర్తించి తమంతట తామే క్రమ శిక్షణ, జవాబుదారీతనం కోసం కొన్ని నియమాలు ఏర్పరు చుకొని ఆ నియమ నిబంధనలను అమలు చేసేందుకు ఒక సంస్థ తప్పనిసరి అని గుర్తించి, ఎవరికి తోచిన రీతిలోవారు కట్టుబాట్లు ఏర్పరుచుకొని, నియంత్రించటానికి, రక్షించుకోటానికి ప్రతి దేశంలోనూ, పోలీసు వ్యవస్థను ఏర్పరుచుకున్నా రని మానవ చరిత్ర చెబుతున్నది.
Read Also: http://Karuna Kitchen : రూ.1కి భోజనం కాదు, గౌరవం | సికింద్రాబాద్‌లో కరుణా కిచెన్ సేవ…

నేర ప్రవృత్తి కట్టడి
పోలీసు అన్న పేరే కానక్కర్లేదు. వివిధ పేర్లతో క్రమేపీ రక్షణ కోసం మానవాళిలో పొడచూపుతున్న నేర ప్రవృత్తి కట్టడి కోసం భౌగోళికంగా ఏర్పడిన ప్రతి ఖండంలోనూ ఈ సంస్థ ఉద్భవించి అలరా రుతున్నది. పోలీసులు పుట్టుక, గత చరిత్ర ప్రస్తుతం అప్ర స్తుతం కానీ రేఖా మాత్రంగా ఏ రూపంలో, ఎందుకోసం పోలీసులు పుట్టుకొచ్చారు అని జ్ఞప్తికి తెచ్చుకోవటానికి మాత్రమే ఈ నేపథ్యం ఇవ్వాల్సి వచ్చింది. అసలు విషయా నికి వస్తే మనదేశంలోని పోలీసులు అనతికాలంలోనే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మంచి పేరు సంపాదించు కున్నమాటనిజం. నేరాలు నిరోధించటంలోనూ, నేరాల దర్యాప్తులోనూ, పరిశోధనలోనూ, ఇతర దేశాల పోలీసులకు ఏమాత్రం తీసిపోని విధంగా, నైపుణ్యాన్ని ప్రతిభను ప్రదర్శించుకోవటమే కాకుండా ఇతర దేశాల ప్రభుత్వాలు ఎదు ర్కోని గడ్డు సమస్యలను అతి చాకచక్యంగా పరిష్కరించుకో గలిగారు. దేశంలో ఉగ్రవాదులు చర్యలను తీవ్రవాదుల సమస్యను గణనీయంగా అణచివేయడంలోనూ అతి త్వర లోనే అనుభవాన్ని గడించి, ఫలితాలు సాధించారు. ముఖ్యం గా పంజాబ్లో కొన్నేళ్ల క్రిందట ఎదుర్కొన్న, ఖలిస్తాన్ వేర్పాటు వాదాన్ని నియంత్రించటంలో శ్రీలంక ఎల్.టి.టి.ఇ సమస్యను పరిష్కరించటంలో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ లాంటి నాయకులను కోల్పోయినా పోలీసులు సమర్థవంతం గా ఇతర బలగాల తోడ్పాటుతో శాంతి భద్రతలను కాపాడ గలిగారు. వి.ఐ.పిల బందోబస్తు, ట్రాఫిక్ సమస్య, ప్రాంతీయ వాదాలు చిక్కుముడులు, కులమత వర్గవైషమ్యాలు వెలికి తెచ్చే శాంతిభద్రతల సవాళ్లు నిత్యమూ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది.
సంఖ్యల్లో కొరత
సమస్యలకు తగ్గ బలగాలు అందుబాటులలోని పరిస్థితి. నిష్పత్తి పరంగా ర్యాంకులపరంగా సంఖ్యల్లో కొరత కొట్టొచ్చేట్లు కనపడుతున్నా పోలీసులు వెనక్కి తగ్గకుండా అహర్నిశలూ పనిచేస్తూ ఎత్తిన జెండాను కిందకు దింపకుండా కష్టాలను అధిగమిస్తున్నారు. సానుకూ లంగా సమీక్షిస్తే వివిధ రకాల ఇబ్బందులకూ, సవాళ్లకూ, జవాబు ఇవ్వగలుగుతున్నా నిజనికి ఫైర్ పైంటిగ్ ఆపరే షన్సుతోనే కాలం గడుపుతున్న నిజాన్ని ఎవరూ కాదన లేరు. ఇప్పటివరకూ వ్యవస్థ నిత్యమూ ఏర్పడుతున్న ప్రతి బంధకాలనూ, గడ్డుకాలాన్ని అధిగమిస్తూ అనుభవం వల్ల వెసులుబాట్లు కల్పించుకుంటూ ముందడుగు వేస్తున్నది. అయితే ముందు ముందు ఇలాంటి గుడ్డిలో మెల్లలాంటి సంతృప్తి కలిగించే వాతావరణమూ, పరిస్థితులూ, పరిణా మాలు ఉండకపోవచ్చు. ఆధునిక యుగంలో అనుకూల మార్పులతోపాటు వ్యతిరేకత మూటగట్టుకొని వచ్చే మార్పులను కాదనక తప్పదు. పోలీసువ్యవస్థ తనను తాను సంస్క రించుకొని ప్రజలకు సానుకూలంగా తయారుకాక తప్పదు. స్థూలంగా రిక్రూట్మెంట్, శిక్షణల్లో మార్పులతోపాటు వ్యవ హారశైలి కూడా పోలీసులు మార్చుకోక తప్పదు. సమాజం లో పోలీసుల జోక్యం జనాభావారీగా 10 శాతం మించి ఉండదు. తొంభై శాతం ప్రజలకు పోలీసుల రక్షణ మానసిక తృప్తి కలిగించేదే. ట్రాఫిక్ బందోబస్తు వ్యవహారాల్లో మాత్ర మే పోలీసులు ప్రత్యక్షంగా తోడ్పడగలరు. ఆవిధంగా విహంగ వీక్షణంగా పోలీసు చేతలను గమనించవచ్చు. మారిన కాలం లో కొన్ని గడ్డు సమస్యలు పోలీసులు వృత్తిపరంగా ఎదుర్కోక తప్పటం లేదు. ఇతర దేశాల్లో పోలీసులతోభయంతోనో, గౌరవంతోనో ప్రజలు వ్యవహరించగలుగుతున్నారు.

పనితీరులోమార్పు
మన దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలో పోలీసులు ప్రవర్తన వల్ల, అవినీతి వల్ల అనవసరపుకఠినత్వ ప్రదర్శన వల్ల ప్రజలకు దూరమవుతున్నారు. ప్రభుత్వాలు ఎన్నో సంస్కర ణలు ప్రవేశపెట్టదల్చుకున్నా అవి కాగితాలకే పరిమితమ య్యాయి. సైబర్ నేరాలుకృత్రిమ మేధస్సుతో ఉబికివస్తు న్న వైవిధ్య భరిత ప్రశ్నలకు దీటుగా కార్యాచరణ ఇంకా సీరియస్ గా పాలకులు తలపెట్టలేదు. పైపెచ్చు వారి రాజకీయ ప్రవర్తన రాజ్యాంగ వ్యతిరేకంగా పోలీసులను పార్టీల కార్యకర్తలుగా మార్చే పరిస్థితి ఏర్పడుతున్నది. దీనిని తక్ష ణం అధిగమించగలుగుతేనే నాలుగు రోడ్ల కూడలి నుంచి నిర్ణీత మార్గంలో సమాజానికి సేవ చేసే మార్గంలో ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. బ్రిటిష్ వారిచ్చిన కాలం చెల్లిన యూనిఫాం మార్చటంతో పోలీసుల్లోమార్పురాదు. మనదేశానికి పనికివచ్చే తీరులో పోలీసుల పనితీరులోమార్పు ను స్పష్టంగా తేవాలి. పోలీసు చట్టాన్ని కాపాడటంతో పాటు అమలు చేయాలి. చట్టాలను చుట్టాలుగామార్చుకున్న పాల కుల చట్రంనుంచి పోలీసులు బయటపడ్డప్పుడే పోలీసును సమాజం ప్రేమిస్తుంది. సహకరిస్తుంది. ప్రజలు ప్రభుత్వాలు పూనుకుంటేనేఅలాంటి మార్పు సాధ్యమవుతుంది.
-రావులపాటి సీతారాంరావు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: