ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రాలను ప్రదర్శించడం ఇప్పుడు రాజకీయంగా వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో ఈ చర్యపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలయ్యింది.
చట్టబద్ధత లేని ప్రదర్శనపై ప్రశ్న
ఈ పిల్‌ను వై.కొండలరావు అనే విశ్రాంత రైల్వే ఉద్యోగి హైకోర్టు(High Court) లో దాఖలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ ఫోటోలను పెట్టడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎటువంటి అధికారిక ఉత్తర్వులు లేకుండా, చట్టపరమైన ప్రమాణాలు పాటించకుండా పవన్ చిత్రాలు ఎలా వేస్తారంటూ తన పిటిషన్‌లో ప్రశ్నించారు.
విధానం వచ్చేవరకు ఫొటోలు తొలగించాలన్న డిమాండ్
పవన్ కళ్యాణ్ ఫోటోలు ప్రదర్శించడాన్ని నిలిపేయాలని, అలాగే ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టమైన విధానం (policy) రూపొందించేదాకా అన్ని ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఆ చిత్రాలను వెంటనే తొలగించాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు.
ప్రతివాదుల జాబితాలో పవన్ సహా ప్రభుత్వ అధికారులు
ఈ వ్యాజ్యంలో పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగత హోదాలోనే ప్రతివాదిగా చేర్చారు. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, సహాయ కార్యదర్శి, మరియు సమాచార & పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ వంటి కీలక ప్రభుత్వ అధికారుల పేర్లను కూడా ప్రతివాదులుగా పేర్కొన్నారు.
విచారణకు సిద్ధమైన హైకోర్టు ధర్మాసనం
ఈ పిల్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టనుంది. కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనే అంశంపై ఇప్పుడు అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Read hindi news:hindi.vaartha.com
Read Also: