రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చేపడుతున్న సంస్కరణలు ప్రశంసనీయం అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శకత్వంలో విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు లోకేశ్ చేస్తున్న కృషి అందరికీ ఆదర్శమన్నారు.
Read Also: Minister Narayana: ప్రభుత్వ పాఠశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతాం
చంద్రబాబు నేతృత్వంలో విద్యా మార్పులు
విద్యార్థులకు ఉత్తమ వాతావరణం, ఆధునిక సదుపాయాలు, పోషకాహారం(nutrition)తో కూడిన భోజనం, నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం శుభ ఫలితాలు ఇస్తుందని పవన్ అభిప్రాయపడ్డారు. ఈ మార్పుల ప్రక్రియలో తల్లిదండ్రులు, గురువులను భాగస్వామ్యులను చేయడం ముఖ్యమని, ఆ దృష్టితో నిర్వహిస్తున్న “మెగా పేరెంట్–టీచర్ మీటింగ్స్” చాలా ప్రభావవంతంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం తనకు ఆనందంగా ఉందని చెప్పారు. విద్యా రంగాన్ని మెరుగుపర్చడంలో లోకేశ్ చూపుతున్న చొరవను పవన్ ప్రత్యేకంగా అభినందించారు.
చిలకలూరిపేట మీటింగ్‌లో
నిన్న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరిగిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్స్‌లో పవన్(Pawan Kalyan) చిలకలూరిపేట కార్యక్రమానికి హాజరైన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా పవన్‌కు ధన్యవాదాలు తెలిపిన లోకేశ్‌కు, ఆయన ఈ సందేశం ద్వారా స్పందించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: