हिन्दी | Epaper

Pawan Kalyan Congratulates India: టీమ్ ఇండియాకు అభినందనలు:పవన్ కళ్యాణ్

Siva Prasad
Pawan Kalyan Congratulates India: టీమ్ ఇండియాకు అభినందనలు:పవన్ కళ్యాణ్

Pawan Kalyan Congratulates India: టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించి, మూడోసారి విశ్వవిజేతగా నిలిచిన భారత క్రికెట్ జట్టుకు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ చారిత్రాత్మక పోరులో టీమ్ ఇండియా ప్రదర్శన అమోఘమని ఆయన కొనియాడారు.

Read Also: Jasprit Bumrah 4 Wickets: ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా జస్‌ప్రీత్ బుమ్రా

క్రీడాభిమానులకు ఎనలేని సంతోషం

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మ్యాచ్ ప్రారంభం నుంచి ముగింపు వరకు భారత జట్టు కనబరిచిన ఆధిపత్యం ప్రశంసనీయమని పేర్కొన్నారు. “ఈ అద్భుత విజయం కోట్లాది మంది భారతీయ క్రీడాభిమానులకు ఎనలేని సంతోషాన్ని, గర్వాన్ని కలిగించింది. ప్రపంచ వేదికపై మన క్రీడాకారులు త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేశారు” అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

Pawan Kalyan Congratulates India
Pawan Kalyan congratulates Team India

Pawan Kalyan Congratulates India: జట్టు సభ్యులకు ప్రత్యేక ప్రశంసలు

సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమ్ ఇండియా సభ్యులందరూ సమిష్టిగా రాణించి తమ అసాధారణ క్రీడా ప్రతిభను చాటారని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. ముఖ్యంగా బ్యాటింగ్‌లో రాణించిన సంజు శాంసన్, బౌలింగ్‌లో కివీస్ నడ్డి విరిచిన జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న అక్షర్ పటేల్, యువ కిరణాలు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మలకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. యువ ఆటగాళ్లు ఒత్తిడిని అధిగమించి ఆడిన తీరు భవిష్యత్తు భారత క్రికెట్‌కు శుభసూచకమని ఆయన పేర్కొన్నారు.

భారత జట్టు ఇదే స్ఫూర్తితో మున్ముందు మరెన్నో విజయాలు సాధించి దేశ కీర్తి ప్రతిష్టలను పెంచాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కవితతో సహా 23 మందికి హైకోర్టు నోటీసులు

కవితతో సహా 23 మందికి హైకోర్టు నోటీసులు

కార్డ్ లేకుండానే ఏటీఎం నుండి నగదు విత్‌డ్రా

కార్డ్ లేకుండానే ఏటీఎం నుండి నగదు విత్‌డ్రా

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!
0:21

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!

ఖమేనీ వారసుడిగా రెండో కుమారుడు మొజ్తబా ఎన్నిక

ఖమేనీ వారసుడిగా రెండో కుమారుడు మొజ్తబా ఎన్నిక

చమురు ధరలు పెరగడంతో.. కుప్పకూలిన రూపాయి విలువ

చమురు ధరలు పెరగడంతో.. కుప్పకూలిన రూపాయి విలువ

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

మహిళా రైతుల కోసం వ్యవసాయ యాంత్రీకరణ పథకం

మహిళా రైతుల కోసం వ్యవసాయ యాంత్రీకరణ పథకం

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల!

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల!

పశ్చిమాసియాలో యుద్ధం.. భారీగా పెరిగిన చమురు ధరలు

పశ్చిమాసియాలో యుద్ధం.. భారీగా పెరిగిన చమురు ధరలు

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ ఎంపీల ధర్నా!

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ ఎంపీల ధర్నా!

తగ్గిన యూరియా ఉత్పత్తి.. రైతులకు తప్పని తిప్పలు!

తగ్గిన యూరియా ఉత్పత్తి.. రైతులకు తప్పని తిప్పలు!

గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందా? ఈ వార్తలపై ఆయిల్ కంపెనీల క్లారిటీ

గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందా? ఈ వార్తలపై ఆయిల్ కంపెనీల క్లారిటీ

📢 For Advertisement Booking: 98481 12870