हिन्दी | Epaper

Palnadu: కోటప్పకొండలో మద్యం అమ్మిన హోంగార్డు సస్పెండ్ 

Saritha
Palnadu: కోటప్పకొండలో మద్యం అమ్మిన హోంగార్డు సస్పెండ్ 

Palnadu: లక్షలాది మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో కోటప్పకొండ (Kotappakonda) పరిసరాలలో పోలీసు సిబ్బంది పాత్ర ఎంతో కీలకమైంది. కొండ పరిసరాలలో అసాంఘిక కార్యక్రమాలు అడ్డుకోవాల్సిన ఓ పోలీసు హోంగార్డు ఆదివారం మద్యం బెల్టుషాపు ఏర్పాటు చేసి బహిరంగంగా మద్యం విక్రయించారు.

Read Also: Deworming Tablets: చిన్నారులకు నులిపురుగుల మాత్రలు తప్పనిసరి: హిమాన్షు శుక్ల

Palnadu: కోటప్పకొండలో మద్యం అమ్మిన హోంగార్డు సస్పెండ్ 
Palnadu: Home guard suspended for selling liquor in Kotappakonda

నరసరావుపేట రూరల్ పోలీసుస్టేషన్లో ఎస్ఐ వద్ద సన్నిహితంగా ఉండే హోంగార్డు కోటేశ్వరరావుకు ఆదివారం కొండ పరిసరాలలో ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన ట్రాఫిక్ సూచికల ఏర్పాటు డ్యూటీ వేశారు. వాటికి డుమ్మా కొట్టిన అతను తన బెల్టుషాపులో అక్రమంగా మద్యం విక్రయిస్తూ కనిపించాడు. ఈ ఘటనతో పోలీసు శాఖపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉంటూ ఇలాంటి అపచారం చేయడమేంటని మండిపడుతున్నారు. తిరునాళ్లలో డ్యూటీ వేస్తే విధులు నిర్వహించకుండా ఏకంగా బెల్టు షాపులు ఏర్పాటు చేసి మద్యం విక్రయించిన హోంగార్డుపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. అక్రమ సంపాదనకు అలవాటు పడిన అతను తిరునాళ్లలో మద్యం విక్రయాలు సాగించాడు. దీంతో జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు సీరియస్ అయ్యారు. వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870