हिन्दी | Epaper

P.S.R Anjaneyulu: విచారణలో ఆంజనేయుల సమాధానాలకు విస్తుపోయిన సీఐడీ అధికారులు

Ramya
P.S.R Anjaneyulu: విచారణలో ఆంజనేయుల సమాధానాలకు విస్తుపోయిన సీఐడీ అధికారులు

కీలక వ్యాఖ్యలు చేసిన పీఎస్సార్

సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు ప్రస్తుతం సీఐడీ అధికారుల విచారణను ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న సీఐడీ అధికారులు, ఆంజనేయులను విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించి, సుదీర్ఘంగా విచారించారు. విచారణ సమయంలో పీఎస్సార్ ఆంజనేయులు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అరెస్టు చేయడానికి మీరొస్తారని వారం ముందే తనకు తెలుసంటూ సీఐడీ అధికారులకు చెప్పుకొచ్చారు. “మీరు నన్ను అరెస్టు చేసేందుకు వస్తారని నాకు ముందే అర్థమైంది. అందుకే ముందస్తుగా బెయిల్ కోసం వెళ్లలేదని” ఆయన పేర్కొన్నట్లు సమాచారం.

సీఐడీ విచారణలో ఆసక్తికర సమాధానాలు

సుమారు ఏడు గంటలపాటు జరిగిన విచారణలో సీఐడీ అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు పీఎస్సార్ తక్కువ పదాల్లో, నిర్లిప్తంగా సమాధానం ఇచ్చారు. “నాకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. జెత్వానీ ఎవరో నాకు తెలియదు. అప్పట్లో నేను చాలా బిజీగా ఉండేవాణ్ణి. ఆమె గురించి ఈ మధ్యనే తెలిసింది. విద్యాసాగర్‌తో ఆమె సహజీవనం గురించి విన్నాను” అంటూ ఆయన వివరణ ఇచ్చారు. విచారణలో ఉన్నంతసేపు పీఎస్సార్ తన ప్రశాంతతను కోల్పోలేదు. ఎలాంటి భయాందోళనలు చూపించకుండానే ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

జెత్వానీపై పీఎస్సార్ స్పందన

పీఎస్సార్ ఆంజనేయులు జెత్వానీ గురించి మాట్లాడుతూ, ఆమెను “బ్యాడ్ లేడీ”గా అభివర్ణించారు. “జెత్వానీ అరెస్టు జరిగినప్పుడు నేను ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నాను. ఈ కేసు లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంటుంది. నాకు దీనితో ఎలాంటి సంబంధం లేదు. అయినా నన్ను విచారణకు పిలవడమేమిటి?” అంటూ సీఐడీ అధికారులను ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. ఆయన వ్యాఖ్యలు విచారణలో ప్రత్యేక దృష్టిని పొందాయి.

విచారణ అనంతర పరిస్థితులు

విచారణ పూర్తైన తర్వాత, పీఎస్సార్ మధ్యాహ్నం సమయంలో స్వల్పంగా అల్పాహారం తీసుకున్నారు. రాత్రి సమయంలో ఇడ్లీలు తిన్నారు. ఈ ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం పీఎస్సార్‌ను కోర్టు ముందు హాజరు పరచడానికి సీఐడీ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. విచారణ మొత్తం ప్రక్రియలో పీఎస్సార్ ఆంజనేయులు తమ దైన నిర్లిప్త ధోరణిని కొనసాగించడం గమనార్హం.

READ ALSO: PSR Anjaneyulu: నటి జెత్వానీ కేసులో ఆంజనేయులకు వచ్చే నెల 7 వరకు రిమాండ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

📢 For Advertisement Booking: 98481 12870