ఆంధ్రప్రదేశ్(AP) ప్రభుత్వం అమరావతికి నేషనల్ హైవేలను కనెక్ట్ చేసే పనిలో ఉంది. రాజధాని అమరావతిని చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారి ఎన్‌హెచ్-16తో కనెక్ట్ చేసే ఈ-13 రోడ్డు నిర్మాణ పనులు స్పీడ్ అందుకున్నాయి. (NH-16 Road) వాస్తవానికి ఈ-13 రోడ్డును నెక్కల్లు నుంచి యర్రబాలెం వరకు ప్రతిపాదించారు. కానీ ఈ రోడ్డును ఇప్పుడు ఎన్‌హెచ్-16 వరకు పొడిగిస్తున్నారు. అమరావతి నుంచి వచ్చే ఈ రోడ్డు విజయవాడ-మంగళగిరి మధ్య డీజీపీ కార్యాలయం దగ్గర ఎన్‌హెచ్-16లో కలుస్తుంది. యర్రబాలెం నుంచి నేషనల్ హైవే 16 వరకు దాదాపు 3.54 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఎన్‌హెచ్-16తో అనుసంధానించేందుకు ఈ-13 రహదారిని పొడిగిస్తున్నారు. నెక్కల్లు నుంచి యర్రబాలెం వరకు 7.5 కి.మీ. ఆరు వరుసల రహదారి ఇప్పటికే నిర్మిస్తున్నారు. ఇప్పుడు, రాజధాని పనులు 2024లో మళ్లీ మొదలయ్యాక, ఈ రహదారిని యర్రబాలెం నుంచి ఎన్‌హెచ్-16 వరకు మరో 3.54 కి.మీ. పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టును రూ.384 కోట్ల వ్యయంతో ఏడాదిలో పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు.
Read Also: AP: ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. బస్సు కండక్టర్లకు పవర్ బ్యాంకులు

ఎలివేటెడ్ కారిడార్లు, ఆర్వోబీ, ఘాట్ రోడ్లు, ఫ్లైఓవర్ ట్రంపెట్ నిర్మాణం
ఈ రోడ్డు డిజైన్ ప్రకారం, యర్రబాలెం నుంచి మొదట 400 మీటర్ల దూరం ఏటవాలుగా రోడ్డు నిర్మిస్తారు. ఆ తర్వాత 960 మీటర్ల దూరం స్తంభాలపై ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మిస్తారు. ఇది వాహనాలు పైనుంచి వెళ్లేలా ఉంటుంది. (NH-16 Road) దీని తర్వాత రైల్వే లైన్‌పై 76 మీటర్ల పొడవైన రైల్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) వస్తుంది. ఈ బ్రిడ్జి దాటిన తర్వాత మరో 405 మీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మిస్తారు. ఆ తర్వాత, కొండపై 741 మీటర్ల పొడవున ఘాట్ రోడ్డు నిర్మాణం ఉంటుంది. కొండలు, లోయలు ఉండటంతో, లోయ భాగంలో 560 మీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్, ఆపై మళ్లీ కొండపై 230 మీటర్ల పొడవైన ఘాట్ రోడ్డు నిర్మిస్తారు. చివరగా, నేషనల్ హైవే వరకు 360 మీటర్ల పొడవున ఏటవాలుగా రోడ్డు నిర్మిస్తారు. జాతీయ రహదారిని దాటడానికి 5.5 మీటర్ల ఎత్తున ఫ్లైఓవర్ నిర్మిస్తారు. ఈ ఫ్లైఓవర్ చివరన ట్రంపెట్ నిర్మాణం ఉంటుంది. ఈ ట్రంపెట్ నిర్మాణం వల్ల గుంటూరు నుంచి అమరావతిలోకి, అమరావతి నుంచి విజయవాడ వైపు వెళ్లేవారు సర్వీస్ రోడ్ల మీదుగా జాతీయ రహదారిపైకి సులభంగా చేరుకోవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: