రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ వివరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్న “స్త్రీ శక్తి” పథకం (Stri Shakti scheme) పెద్ద విజయంగా నిలిచిందని ఆయన అన్నారు. ఈ స్ఫూర్తితోనే మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమాలను ప్రభుత్వం కొనసాగిస్తోందని తెలిపారు.

ర్యాపిడో భాగస్వామ్యంతో కొత్త అవకాశాలు
మహిళల ఉపాధి కోసం ప్రభుత్వం ర్యాపిడో (Rapido) సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా వెయ్యి మందికి పైగా మహిళలు డ్రైవర్లుగా పని చేసే అవకాశం పొందారని లోకేశ్ వెల్లడించారు. ఈ కార్యక్రమం మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు దోహదపడుతుందని తెలిపారు. సోమవారం తన ‘ఎక్స్’ ఖాతాలో మహిళలు ర్యాపిడో వాహనాలు నడుపుతున్న వీడియోను కూడా పంచుకున్నారు.
ఎలక్ట్రిక్ వాహనాలపై రాయితీలు
మహిళలకు ఉపాధి అవకాశాలకే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు పై ప్రత్యేక రాయితీలు కూడా అందిస్తున్నామని మంత్రి గుర్తుచేశారు. రవాణా ప్రణాళిక అనేది కేవలం ప్రయాణం కోసం మాత్రమే కాకుండా, మహిళలకు గౌరవం, స్వయం సమృద్ధి కలిగించే అవకాశం అని ఆయన అన్నారు.
మంచి ప్రభుత్వానికి నిదర్శనం
మహిళల రవాణా సౌకర్యాల అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన, ఆర్థిక సహాయం వంటి చర్యలతో తమ ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా ముందుకు సాగుతోందని లోకేశ్ స్పష్టం చేశారు. ఇలాంటి పథకాలతో “మన ప్రభుత్వం నిజంగా మంచి ప్రభుత్వం” అని రుజువు చేసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: