ప్రపంచ ఆరోగ్యసంస్థ నివేదికల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల వీధి కుక్కలున్నట్టు తెలుస్తున్నది. వీటివల్ల సంక్రమించే ప్రమాదకరమైన రేబీస్ వ్యాధి ప్రతి యేటా వేలాది మందిని బలికొంటున్నది. అందువల్ల వీధి కుక్కల నియంత్రణ పలుదేశాలకొక ప్రధాన సమస్యగా పరిణమించింది. ప్రపంచంలోని దేశాలన్నీ పౌరులమీద వీధికుక్కల (Stray dogs)దాడులతో తల్లడిల్లుతన్నా, ఒక్క దేశంలో మాత్రం వీధుల్లో వీధికుక్కలు కనిపించవు. అందువల్ల కుక్కకాటు బాధితులు ఆ దేశంలో మచ్చుకయినా కనిపిం చరు. దీనివల్ల వీధికుక్కల (Stray dogs)సంపూర్ణ నియంత్రణలో విజయం సాధించిన తొలిదేశంగా గుర్తించబడిందా దేశం. ఆ దేశమే యూరప్ లోని నెదర్లాండ్. అయితే ఈవిజయం ఆ దేశంలో ఒక్క రోజులో రాలేదు. దశాబ్దాలుగా ఆదేశ ప్రభుత్వాల కృషి ఈ విజయం వెనుక దాగివుంది. అంతేకాదు ఆదేశ జంతు ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ కృషికి అండగా నిలిచారు. వాస్తవంగా 18, 19శతాబ్దాల్లో నెదర్లాండ్ సంపన్న కుటుంబాల్లో పెంపుడు కుక్కలని హోదాకు చిహ్నంగా భావించేవారు. అందువల్ల ప్రతి సంపన్న కుటుంబం కొన్ని కుక్కలని పెంచుకొనేది. అయితే 19వ శతాబ్ధంలో ఆ దేశంలో కుక్కల్లో రేబీస్ వ్యాధి ప్రబ లింది. దీనితో భయపడ్డ కుక్కల యజమానులు అన్నేళ్ళుగా తాము అల్లారు ముద్దుగా పెంచుకొన్న పెంపుడు కుక్కలని వీధుల్లోకి తరిమారు.. ఈ కుక్కల్లో చనిపోయేవి చనిపోగా బ్రతికిన కుక్కలు తమ సంతతని వీధికుక్కలుగా విపరీతం గా పెంచుకొన్నాయి. ఒక ఆడకుక్క ఏడాదికి పది పిల్లలని సృష్టిస్తూ అయిదు సంవత్సరాల్లో తనకుటుంబాన్నిఅయి దువేలకు పెంచుతుంది. అందువల్ల సరైన ఒక విధానం, దానితోపాటే నిరంతర కృషి వుండాలని నెదర్లాండ్ ప్రభు త్వం భావించింది. దానికనుగుణంగా కార్యాచరణ కొన సాగింది. వివిధ వర్గాలనుండి సూచనలు సేకరించిన ప్రభు త్వం చివరగాఈ సిఎన్ విఆర్ పద్ధతిని తన విధానంగా మార్చుకొంది.
Read Also : Bengaluru: చెత్తను ఇంట్లో పెట్టుకుంటే జరిమానా.. వీధిలో పడేస్తే అరెస్ట్..

వివరంగా చెప్పాలంటే, మొట్టమొదట వీధి కుక్కలని పట్టుకొని సంరక్షణ గృహాలకు తరలిస్తారు, రెండవ దశలో శస్త్ర చికిత్స ద్వారా వాటికి కుటుంబ నియంత్రణ చేస్తారు. మూడవ దశలో వాటికి వ్యాధులు సోకకుండా టీకాలు ఇస్తారు. ఆ తరువాత వాటిని ఎక్కడినుండి తెచ్చారో అక్కడే వదిలి పెడతారు. ఈ విధానం పాటించడంతో నెద ర్లాండ్లో వీధికుక్కల నియంత్రణ సంపూర్ణ విజయవంతమై ంది. నెదర్లాండ్ విధానాన్ని పరిశీలించిన వివిధ దేశాలు తమ దేశాల్లో కూడా ఈ విధానాన్ని అనుసరించేందుకు ప్రయత్ని స్తున్నాయి. ఇక మన దేశ విషయానికొస్తే మన దేశంలో 1.53కోట్ల వీధి కుక్కలున్నాయని, వీటివల్ల సంక్రమించే రేబీస్లో 20వేలమంది మరణిస్తున్నారని తెలుస్తున్నది. ప్రత్యే కంగా మన రాష్ట్రమ్లో 5.5 లక్షల వీధికుక్కలున్నట్టు,, వీటి వల్ల రేబిస్ సోకిపదుల సంఖ్యల్లో పౌరులు మరణిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మనకేంద్ర ప్రభుత్వం ఈవిషయాన్ని తీవ్రంగా పరిగణిస్తూ వీధికుక్కలు నియంత్రణకు తగు చర్య లని చేపట్టాల్సిన అవసరముంది. అంతేకాదు అవసరమని పిస్తే అమాత్యులతో కూడిన ఒక అధికారుల బృందాన్ని నెదర్లాండ్ పంపించి, ఆ ప్రభుత్వంఅనుసరించిన విధానా లను పరిశీలించి, వాటిని మన దేశంలో అమలు పరిచి వీధి కుక్కలను నియంత్రించాల్సిన అవసరముంది.
-బసవరాజు నరేందర్ రావు
వీధి కుక్కలు అంటే ఏమిటి?
వీధి కుక్క అంటే, యజమానులు తక్కువ, ఆశ్రయం లేని కుక్కలు, ఇవి వీధులు, పార్కులు, హోటళ్ల చుట్టూ, పాఠశాల మరియు కళాశాల ప్రాంగణాలు, ఆసుపత్రి ప్రాంగణాలు, బస్సు మరియు రైల్వే స్టేషన్ ప్రాంగణాలు మరియు ఇతర బహిరంగ ప్రదేశాలలో కనిపిస్తాయి .
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: