రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు జీన్ హెన్రీ డ్యూనాంట్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కలెక్టర్
నెల్లూరు (Nellore) లోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చైర్మన్ వాకాటి విజయ కుమార్ రెడ్డి , వైస్ చైర్మన్ చమర్తి జనార్ధన రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ , ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ హిమాన్షు శుక్లా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
Read also: AP: ‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

తల సేమియా పిల్లలను ఆప్యాయంగా పలకరించారు
ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన , రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు జీన్ హెన్రీ డ్యూనాంట్ విగ్రహాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. విగ్రహ దాత కలికి శ్రీహరి రెడ్డిని ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. తొలుత ఆయన తల సేమియా విభాగంలో వ్యాధిగ్రస్తులకు అందుతున్న సేవలను పరిశీలించారు. తల సేమియా పిల్లలను ఆప్యాయంగా పలకరించారు.
వారికి అందుతున్న సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు.వాడవాడలా రెడ్ క్రాస్ సేవలు ( రక్త గ్రూపు నిర్ధారణ పరీక్షలు ) కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక వాహనాన్ని ఈ సందర్భంగా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జీన్ హెన్రీ డ్యూనాంట్ డాక్టర్ జేజి. జోలి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు .
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: