Nellore Municipal Schools: నెల్లూరు నగరంలోని ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దేందుకు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నడుం బిగించారు. సామాన్యుల పిల్లలకు కూడా కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే సంకల్పంతో ఆయన నెల్లూరులోని మున్సిపల్ పాఠశాలలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు స్టోన్‌హౌస్ పేటలోని BVS మున్సిపల్ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. BVS పాఠశాలను సందర్శించిన మంత్రి, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.పాఠశాల అభివృద్ధి కోసం సుమారు రూ. 5.5 కోట్ల సీఎస్ఆర్ నిధులను ఓ దాత కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
Read Also: Tirumala Ratha Saptami: తిరుమలలో వైభవంగా రథసప్తమి
కేవలం భవనాలే కాకుండా, అత్యాధునిక ల్యాబ్‌లు, డిజిటల్ క్లాస్ రూమ్‌లతో ఈ పాఠశాలను కార్పొరేట్ సంస్థలకు దీటుగా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.BVS పాఠశాల మాత్రమే కాకుండా, నెల్లూరు నగరవ్యాప్తంగా 15 మున్సిపల్ హైస్కూల్స్ ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి, అంతర్జాతీయ ప్రమాణాలతో (International Standards) తీర్చిదిద్దుతున్నామన్నారు. ఇప్పటికే దాదాపు రూ. 15 కోట్లతో కేవలం నాలుగు నెలల రికార్డు కాలంలో VR హైస్కూల్‌ను పునర్నిర్మించినట్టు చెప్పారు. దాతల సహకారం మరువలేనిదన్నారు . ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, డి.ఎస్. రెడ్డి వంటి ప్రముఖులు మరియు జిగ్మా, రెడ్డి ల్యాబ్స్ వంటి కార్పొరేట్ సంస్థలు తమ CSR నిధులతో ఈ పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారన్నారు.


Nellore Municipal Schools: Minister Narayana’s special focus on Nellore schools
ముఖ్యంగా 42, 43, 48 డివిజన్లలో పాఠశాలల కొరతను తీర్చేందుకు,5 ఎకరాల స్థలంలో కొత్త పాఠశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. దీనికోసం ఎంపీ సీఎం రమేష్ గారు సుమారు రూ. 20 కోట్ల సాయం అందించేందుకు ముందుకు రావడం విశేషమన్నారు.పారిశుధ్య కార్మికులు, కూలీల పిల్లలు చదువుకునే ఈ మున్సిపల్ పాఠశాలలు ప్రపంచంలోనే అత్యుత్తమ పాఠశాలలుగా నిలుపుతామన్నారు.ప్రస్తుతం ఉన్న 54 మున్సిపల్ స్కూల్స్ లో 10 వేల మంది చదువుతుంటే, మేము అభివృద్ధి చేస్తున్న ఈ 15 స్కూల్స్ లోనే భవిష్యత్తులో 15 వేల మందికి పైగా విద్యార్థులు చేరేలా సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు.
క్రీడల కోసం స్టేడియంలను కూడా అందుబాటులోకి తెస్తున్నామన్నారు..మంత్రి నారాయణ తీసుకుంటున్న ఈ చొరవతో నెల్లూరు విద్యా హబ్‌గా మారడమే కాకుండా, పేద విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు పడతాయని నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు..
ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ , ఇంచార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పిటిసి విజేత రెడ్డి, 7 వ డివిజన్ కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి ,స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు .
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: