దగదర్తి (Nellore) : గతంలో పలుమార్లు అక్రమ గ్రావెల్ తరలింపు పై మైనింగ్, రెవెన్యూ అధికారులు హెచ్చరించి కేసులు నమోదు చేసిన గ్రావెల్ దోపిడి(Gravel loot) ఆగడం లేదు. దగదర్తి మండలంలోని తిరువీధిపాడు గ్రామ రెవెన్యూలో మోపూరు భక్తవత్సలరెడ్డి కి సర్వే నెంబరు 118లో సుమారు 105 ఎకరాల పట్టా భూమి ఉంది.
Read also: TTD: శ్రీవారికి కాసుల వర్షం.. తిరుమలలో పెరిగిన రద్దీ!

రెండు రోజులుగా తన సొంత భూమి
గత రెండు రోజులుగా తన సొంత భూమిలో కొందరు వ్యక్తులు రాత్రులు, పగలు బరితెగించి అక్రమంగా వాహనాలతో గ్రావెల్ తరలిస్తున్నారని రైతు భక్తవత్సలరెడ్డి మంగళవారం రెవెన్యూ, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మైనింగ్ ఏడీ వాణిశ్రీ, మండల ఆర్ఎ ప్రియాంక, వీఆర్వో నరేష్లతో కలిసి మైనింగ్ ప్రదేశానికి వెళ్లి గ్రావెల్ అక్రమ తరలింపును అడ్డుకున్నారు.
సంఘటన స్థలంలో ఉన్న మూడు టిప్పర్లను సీజ్ చేసి స్థానిక పోలీసు స్టేషన్లో అప్పగిస్తున్నట్లు మైనింగ్ ఏడీ తెలిపారు. అధికార పార్టీ నాయకుల అండతోనే తమ భూమిలో గ్రావెల్ అక్రమంగా తరలిస్తు న్నారని రైతు భక్తవత్సల రెడ్డి చెబుతున్నారు. అధికారులు తగిన విచారణ జరిపి అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రైతు కోరుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: