క్యాన్సర్ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి వి. సుజాత పిలుపునిచ్చారు. నెల్లూరులోని డిఎం అండ్ హెచ్ ఓ కార్యాలయంలో క్యాన్సర్ వ్యాధి నివారణలో భాగంగా మంగళవారం జరిగిన శిక్షణా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ, క్యాన్సర్ వ్యాధిని తరిమికొట్టేందుకు , వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైద్య సిబ్బంది సిద్ధం కావాలన్నారు. ఇందుకోసం హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) వ్యాక్సిన్ పై శిక్షణా కార్యక్రమాన్ని రెండు రోజులపాటు నిర్వహించడం జరిగిందన్నారు.
Read Also: AP: తుని సమీపంలో సింహాద్రి ఎక్సప్రెస్ లో పొగలు…
నెల్లూరు (Nellore) జిల్లాలో 14వ సంవత్సరము పూర్తి అయి 15వ సంవత్సరం లోపు ఆడపిల్లలందరికీ క్యాన్సర్ వ్యాధి నివారణ వ్యాక్సిన్ ఇవ్వటం జరుగుతుందని, అందుకోసం గ్రామస్థాయిలో సర్వే నిర్వహించి అర్హులైన పిల్లలను గుర్తించాలని, జిల్లాలోని అన్ని ప్రాథమిక, అర్బన్ కేంద్రాలలో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుందని, తెలియజేశారు .జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారిణి డాక్టర్ ఉమామహేశ్వరి మాట్లాడుతూ,
జిల్లా లోని ప్రాథమిక అర్బన్ ఆరోగ్య కేంద్రాల పరిధిలోని అన్ని గ్రామాలలో క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ కొరకు అర్హులైన పిల్లలను ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు సర్వే నిర్వహించి కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలని, క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ కార్యక్రమం మూడు నెలల పాటు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,అర్బన్ ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు,

సమన్వయం
ప్రాంతీయ ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రి లలో నిర్వహించడం జరుగుతుందని, విద్యాశాఖ, స్త్రీ శిశుసంక్షేమ శాఖ, స్వచ్ఛంద సంస్థలు వారితో సమన్వయం చేసుకొని కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో DLATO డాక్టర్ ఖాదర్ వలీ, DIO డాక్టర్ ఉమామహేశ్వరి, డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ బ్రిజిత, DPMO డాక్టర్ సునీల్ కుమార్ NCD PO డాక్టర్ యశ్వంత్,FDP జిల్లానోడల్ ఆఫీసర్ డాక్టర్ అమరేంద్ర నాథ్ రెడ్డి, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అశోక్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: