Nellore Murder Case: నెల్లూరు నగరంలోని కోటమిట్టకు చెందిన శ్రీహరికి, ఆత్మకూరుకు చెందిన నందిని (24)కి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. శ్రీహరి ప్రైవేట్ బస్సు సర్వీసులో సూపర్వైజర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఒక పాప కూడా ఉంది. అయితే, కొంతకాలం తర్వాత శ్రీహరి ప్రవర్తనలో మార్పు రావడం, విభేదాలు తలెత్తడంతో వీరిద్దరూ విడిపోయారు. నందిని విడాకుల కోసం కోర్టును ఆశ్రయించి, బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది.
Read Also: Australia: భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?
పాప కోసం సాగిన మాటలు – మృత్యువుకు దారితీసిన నమ్మకం
పాప తండ్రి వద్దే ఉండటంతో, బిడ్డ కోసం నందిని అప్పుడప్పుడు శ్రీహరితో మాట్లాడేది. ఈ క్రమంలోనే శనివారం తెల్లవారుజామున బెంగళూరు నుండి నెల్లూరుకు వచ్చిన నందిని, తనను ఆత్మకూరు బస్టాండ్ వద్ద డ్రాప్ చేయాలని శ్రీహరిని కోరింది. భర్త మనసు మారిందని భావించిన ఆమె నమ్మకం, చివరకు ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది.

విచక్షణ రహితంగా కత్తితో దాడి
జాతీయ రహదారి వద్ద భార్యను తన బైక్‌పై ఎక్కించుకున్న శ్రీహరి, మార్గమధ్యలో మళ్లీ గొడవ పడ్డాడు. పక్కా ప్రణాళికతో తన వెంట తెచ్చుకున్న కత్తితో నందినిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలైన నందిని అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. నిందితుడు శ్రీహరి అక్కడి నుండి పరారయ్యాడు.
సమాచారం అందుకున్న బాలాజీ నగర్ సీఐ సాంబశివరావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు శ్రీహరి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: