हिन्दी | Epaper
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

National Highway: ఏపిలో 10 జాతీయ రహదారులకు మహర్దశ

Anusha
National Highway: ఏపిలో 10 జాతీయ రహదారులకు మహర్దశ

988 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు సిద్ధం కానున్న ప్రతిపాదనలు

విజయవాడ : రాష్ట్రంలోని పది జాతీయ రహదారులు అభివృద్ధిపై ఎన్హెచ్ఐ ప్రత్యేక దృష్టిపెట్టింది. దీంతో ఈ రహదారలు విస్తరణ వేగవంతం కానున్నది. రోడ్లపై వాహన రద్దీతో పాటు మున్ముందు మరింత ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉందని గుర్తించడంతో వాటి విస్తరణపై కేంద్రం దృష్టిపెట్టింది. ఆయా జాతీయ రహదారులను 988 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించింది. వాహన రద్దీని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలోని పది జాతీయ రహదారులకు విస్తరణ దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఆయా జాతీయ రహదారుల్లో 988 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు వీలుగా సాధ్యాసాధ్యాల నివేదిక, డీపీఆర్ రూపొందించేలా కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (Ministry of National Highways) ఆదేశించింది. తాజాగా ప్రకటించిన 2025- 2026 వార్షిక ప్రణాళికలో ఈ రహదారులను కేంద్ర ప్రభుత్వం చేర్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా అధికారులు డీపీఆర్లు సిద్ధం చేసి పంపిస్తే, వాటికి ఆమోదం లభించనుంది.

పలమనేరు నుంచి కుప్పం మీదుగా

కావలి, కలిగిరి పట్టణాల వద్ద 20 కిలోమీటర్ల మేర బైపాస్లు నిర్మిస్తారు. కావలి వద్ద చెన్నైకోల్కతా హైవేలో బైపాస్ ఉండగా, కావలికి మరోవైపు దుత్తలూరు నుంచి వచ్చే హైవే 165ఎన్హెచ్ సైతం బైపాస్ నిర్మించనున్నారు. దీనివల్ల కావలికి రింగ్ రోడ్డు అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది.కత్తిపూడి నుంచి ఒంగోలు, రాజమహేంద్రవరం నుంచి రామచంద్రపురం జాతీయ రహదారుల విస్తరణ కోసం డీపీఆర్ (DPR) తయారీకి సలహా సంస్థల ఎంపికకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. ఏపీ, కర్ణాటక సరిహద్దు నుంచి కదిరి, ముదిగుబ్బ మీదుగా అనంతపురం వరకు 86 కిలోమీటర్లు 4 వరుసలుగా విస్తరిస్తారు. ఇందులో కదిరి, ముదిగుబ్బల వద్ద బైపాస్లు కూడా ఉన్నాయి. పలమనేరు నుంచి కుప్పం మీదుగా తమిళనాడులోని కృష్ణగిరి సరిహద్దు వరకు 97 కిలోమీటర్ల దూరాన్ని నాలుగు వరుసలుగా చేయనున్నారు. గుత్తి నుంచి తాడిపత్రి, ముద్దనూరు నుంచి జమ్మలమడుగు వరకు మొత్తం 69 కిలోమీటర్లు 4 వరుసలుగా విస్తరిస్తారు.

మిగిలిన భాగం ప్రస్తుతం రెండు వరుసలు

అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వరకు 52 కిలోమీటర్లు 4 వరుసలుగా చేస్తారు. రాజమహేంద్రవరం నుంచి రంపచోడవరం మధ్య 3 చోట్ల 24 కిలోమీటర్లు, విశాఖపట్నం రాయ్పూర్ మార్గంలో 13 కిలోమీటర్లు పది మీటర్ల వెడల్పుతో రెండు వరుసలుగా విస్తరించనున్నారు. కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు 380 కిలోమీటర్ల 216ని నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. ఇందులో కత్తిపూడి నుంచి కాకినాడ వరకు 27 కిలోమీటర్లు ఇప్పటికే నాలుగు వరుసలుగా ఉంది. దీనిని ఆరు వరుసలు చేయనున్నారు. మిగిలిన భాగం ప్రస్తుతం రెండు వరుసలు ఉండగా నాలుగు వరుసలుగా విస్తరిస్తారు. కర్నూలు (Kurnool) నుంచి నంద్యాల, కడప, రాయచోటి, పీలేరు, చిత్తూరు మీదుగా తమిళనాడులోని రాణీపేట వరకు ఉన్న ఎన్వాచ్40ని కడప నుంచి చిత్తూరు జిల్లాలోని రంగంపేట క్రాస్ వరకు 148 కిలోమీటర్లు 4 వరుసలుగా విస్తరించనున్నారు.

ప్రతిపాదనలు సిద్ధం చేసేలా మోర్త్ వార్షిక

శ్రీసత్యసాయి జిల్లాలోని కొడికొండ చెక్ పోస్ట్ నుంచి సిర వరకు 99 కిలోమీటర్లు 4వరుసలు చేస్తారు. ఏపీ, కర్ణాటక సరిహద్దు నుంచి కదిరి, ముదిగుబ్బ మీదుగా అనంతపురం వరకు 86 కిలోమీటర్లు 4 వరుసలుగా విస్తరిస్తారు. ఇందులో కదిరి, ముదిగుబ్బల వద్ద బైపాస్ లు కూడా ఉన్నాయి. వీటిలో పలమనేరు నుంచి కుప్పం మీదుగా తమిళనాడులో (Tamil Nadu) ని కృష్ణగిరి సరిహద్దు వరకు 97 కిలోమీటర్ల దూరాన్ని నాలుగు వరుసలుగా చేయనున్నారు. మొత్తంగా 988 కిలోమీటర్ల విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసేలా మోర్త్ వార్షిక ప్రణాళికలో పేర్కొనగా ఇందులో 931 కిలోమీటర్లు నాలుగు వరుసల విస్తరణ ప్రాజెక్టులే ఉన్నాయి, ఇక విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారి65ని ఆరు వరుసలుగా విస్తరించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ కార్యాచరణ ఆరంభించింది. నేషనల్ హైవేలను నౌకాశ్రయాలకు అనుసంధానం చేసే ప్రాజెక్టులో భాగంగా ఈ రహదారిని మచిలీపట్నం పోర్టు వరకూ విస్తరిస్తారు.

National Highway: ఏపిలో 10 జాతీయ రహదారులకు మహర్దశ
National Highway:

మాచవరం రైస్ మిల్లు వరకు 4 కిలోమీటర్లు

ఇందుకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేస్తున్నారు. విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు జాతీయ రహదారి 63 కిలోమీటర్ల మేర ఉంది. ఇందులో అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు కంకిపాడు ఉయ్యూరు మధ్య చలివేంద్రపాలెం దగ్గరలో క్రాస్ అవుతుంది. అక్కడి నుంచి మచిలీపట్నం వరకు 44 కిలోమీటర్ మేర ప్రస్తుతం ఉన్న నాలుగు వరుసల మార్గాన్ని 6 వరుసలుగా విస్తరిస్తారు. మచిలీపట్నం (Machilipatnam) వద్ద ఒంగోలు కత్తిపూడి నేషనల్ హైవే రెండు వరుసలుతో ఉంది. ఇందులో మాచవరం రైస్ మిల్లు వరకు 4 కిలోమీటర్లు నాలుగు వరుసలుగా విస్తరిస్తారు. మాచవరం రైస్ మిల్లు వద్ద నుంచి పోర్టుకు 3.7 కిలోమీటర్లను నాలుగు వరుసలతో కొత్తగా రహదారిని నిర్మిస్తారు.

రహదారిని విస్తరించనున్నారు

వీటిలో ఆరు వరుసలుగా విస్తరించనున్న 44 కిలో మీటర్లతో పాటు 3.7 కిలో మీటర్లు మేర నాలుగు వరుసల హైవే నిర్మాణాన్ని ఎన్హెచ్ఎ చేపడుతుంది. ఒంగోలుకత్తిపూడి హైవేలో 4 కిలోమీటర్ల మేర విస్తరించే పనులను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ పర్యవేక్షిస్తుంది. మొత్తంగా ఈ రహదారికి చెందిన తయారీ బాధ్యత చైతన్య, ఎంఎస్ పార్క్ జేవీ సంస్థకు అప్పగించారు. విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు ఉన్న హైవేలో ఓఆర్ఆర్ (ORR) క్రాస్ అయ్యే ప్రాంతం నుంచి మాత్రమే రహదారిని విస్తరించనున్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి పోరంకి, పెనమలూరు జంక్షన్, కంకిపాడు మీదుగా చలివేంద్రపాలెం వరకు 19 కిలోమీటర్ల మేర ఉన్న మార్గాన్ని 6 వరుసలుగా విస్తరించడంపై ఇంకా స్పష్టత లేదు. విజయవాడ పరిధిలోనే వాహన రద్దీ ఈ పరిధిలోనే ఎక్కువగా ఉంటుంది.

Read Also: Visakhapatnam: పౌర సేవల్లో విశాఖ టాప్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870