Nara Lokesh: క్రికెట్ ప్రపంచం గర్వించదగ్గ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన కుమారుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్, తన చిరకాల స్నేహితురాలు సానియా చందోక్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ముంబయిలోని ప్రఖ్యాత సెయింట్ రెజిస్ హోటల్ ఈ అద్భుత వేడుకకు వేదికైంది. ఈ శుభకార్యం సందర్భంగా టెండూల్కర్ నివాసం మరియు వివాహ వేదిక వద్ద కోలాహలం నెలకొంది.
Read Also: AP 10th Hall tickets Release: ఏపీ పదో తరగతి హాల్ టికెట్లు విడుదల

హాజరైన నారా లోకేశ్ – బ్రహ్మణి దంపతులు
అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన అర్ధాంగి బ్రహ్మణితో కలిసి హాజరయ్యారు. ఈ ఉదయం ముంబయి చేరుకున్న లోకేశ్ దంపతులకు సచిన్ టెండూల్కర్ కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. నూతన వధూవరులైన అర్జున్-సానియా జోడికి లోకేశ్ దంపతులు పుష్పగుచ్ఛం అందించి, ఆశీర్వదించారు. ఈ వివాహ మహోత్సవానికి దేశంలోని క్రీడా, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: