Nara Lokesh : రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ (జనవరి 23) లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షల సందేశం విడుదల చేశారు. విద్య, ఐటీ రంగాల్లో లోకేశ్ చేస్తున్న కృషిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.
రాష్ట్ర విద్యా వ్యవస్థను భవిష్యత్ తరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో లోకేశ్ ముందుండి పనిచేస్తున్నారని పవన్ పేర్కొన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి, ఉపాధ్యాయులు–తల్లిదండ్రుల మధ్య సానుకూల వాతావరణం కల్పించడంపై లోకేశ్ చూపుతున్న దృష్టి అభినందనీయమన్నారు. అలాగే ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షిస్తూ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలను కొనియాడారు. ప్రజాసేవలో మరింత శక్తి, సంకల్పంతో ముందుకు సాగాలని పవన్ ఆకాంక్షించారు.

Read Also: T20: యువరాజ్ సింగ్ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్
ఈ శుభాకాంక్షలకు లోకేశ్ వినమ్రంగా స్పందించారు. (Nara Lokesh)“థాంక్యూ పవన్ అన్న. మీ ఆత్మీయ మాటలు నాకు మరింత బలాన్ని ఇచ్చాయి. అర్థవంతమైన విద్యా సంస్కరణలు, బలమైన పారిశ్రామిక వాతావరణం, యువతకు మెరుగైన అవకాశాల కోసం నా కృషి కొనసాగుతుంది. మీ ఆశీస్సులు, ప్రోత్సాహానికి హృదయపూర్వక కృతజ్ఞతలు” అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: