జువ్వల దిన్నెలో సాగర్ డిఫెన్స్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్
బిట్రగుంట (నెల్లూరు) : రాష్ట్రాన్ని రక్షణ తయారీ, సముద్ర సాంకేతిక రంగాల్లో దేశంలోనే ప్రముఖ కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. గురువారం నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ సమీపంలో ఏర్పాటు చేయనున్న సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ సంస్థకు మంత్రి శంకుస్థాపన చేశారు.
Read also: Payakaraopeta Crime: బాలికపై లైంగిక దాడి.. వీడియోలతో బ్లాక్‌మెయిల్

Nara Lokesh: AP Tops in Defense Products
అత్యాధునిక సాంకేతికతతో దేశ రక్షణకు ఊతం
జరిగిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో ప్రపంచంలోనే గొప్ప పరిశ్రమను తమ రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన కంపెనీ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు. తన యువగళం పాదయాత్ర సమయంలో ప్రాంత మత్స్యకారులకు, వారి పిల్లలకు భవిష్యత్తుకు అండగా ఉంటామని హామీ ఇచ్చాను అని, ఆ హామీని నిలబెట్టుకుంటూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నట్లు చెప్పారు. దేశ రక్షణ రంగానికి అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరికరాల తయారీలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించనుందని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆటోనమస్ మారిటైమ్ సిస్టమ్స్, అన్మ్యాన్డ్ సర్ఫేస్ వెసల్స్, ఆధునిక సముద్ర సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి జరగనుందని తెలిపారు. ఈ కంపెనీతో తనకు ఒక బలమైన అనుబంధం ఉందని చెప్పారు.
ఉపాధి కల్పన మరియు తీర ప్రాంత భద్రత
రాష్ట్రానికి వచ్చిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు, భారత స్వదేశీ రక్షణ తయారీ సామర్థ్యాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లడమే కాకుండా, సముద్ర సాంకేతికతలో వినూత్న ఆవిష్కరణలకు నాంది పలకనుంది. తీర ప్రాంత భద్రత, పర్యవేక్షణను మరింత బలోపేతం చేస్తూ, మత్స్యకార రంగం, పారిశ్రామిక నైపుణ్యాల అభివృద్ధికి ఈ కేంద్రం ఒక గొప్ప ఊతంగా నిలవనుందని లోకేష్ అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు వెయ్యి మందికి పైగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించబడనున్నాయని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర యువతకు అధునాతన సాంకేతిక రంగాల్లో ఉద్యోగ అవకాశాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
మత్స్యకారుల అభ్యున్నతికి పెద్దపీట
భారతదేశం సువిశాలమైన సముద్ర తీర ప్రాంతాన్ని కలిగి ఉందని, అందులో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని మంత్రి చెప్పారు. సముద్ర తీర ప్రాంతాలను ఆధునిక పరిశ్రమల కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో పనిచేస్తోందన్నారు. లక్షలాది కుటుంబాలు రాష్ట్రంలో సముద్ర తీరంపై ఆధారపడి జీవిస్తున్నాయని, అందుకనే ముఖ్యమంత్రి ఈ రంగాన్ని అభివృద్ధి చేయాలని ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఆక్వా రంగం, మత్స్యకార రంగాలను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్: ఒక డ్రీమ్ ప్రాజెక్ట్
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్రీమ్ ప్రాజెక్ట్ అని, దీని ద్వారా మత్స్యకారుల జీవన స్థితిగతులు మారనున్నట్లు చెప్పారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుతో 25 వేల మత్స్యకార కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని, 1250 మేకనైజ్డ్ బోట్లు నిలుపుకునేలా, 41 వేల టన్నుల చేపల నిల్వ సామర్థంతో ఈ ఫిషింగ్ హార్బర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మత్స్యకారులకు ఈ ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, ఇందులో ఎటువంటి సందేహం లేదని మంత్రి నారా లోకేష్ మత్స్యకారుల అభివృద్ధికి దోహదపడుతుందన్నారు, ఆధునిక సాంకేతిక రంగాలు మరింత బలోపేతం అవుతాయని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుతో అభివృద్ధి కొత్తపుంతలు తొక్కుతుందన్నారు. విజనరీ లీడర్ చంద్రబాబు, యువనేత నారా లోకేష్ కృషితో రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: