ప్రకాశం జిల్లాలోని బల్లికురవ మండలం సమీపంలో ఉన్న ఓ గ్రానైట్ క్వారీ (Granite Quarry) లో జరిగిన విషాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం బండరాళ్లు విరిగి పడటంతో ఆరుగురు కూలీలు దుర్మరణం చెందారు. ఈ ఘటనపై ఆయన స్పందిస్తూ తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు.

కూలీల మృతి కలచివేసిన ఘటన: మంత్రి స్పందన
“రోజువారీ కూలీలు కష్టపడుతూ ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం,” అని మంత్రి లోకేశ్ (Nara Lokesh) అన్నారు. ఈ విషాద ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, బాధిత కుటుంబాలకు తాను సానుభూతి (condolences to the families) తెలుపుతున్నానని తెలిపారు.
గాయపడిన వారికి వైద్య సాయం కల్పించాలి: అధికారులకు మంత్రి ఆదేశం
ఈ ప్రమాదంలో గాయపడిన కార్మికులకు తగిన వైద్య సాయం వెంటనే అందించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ పక్షాన బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
read also: