మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (YS Jagan Mohan Reddy) మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) సవాల్ విసిరారు. యూఆర్‌ఎస్‌ఏ కంపెనీకి ఎకరానికి 99 రూపాయలకు ఇచ్చామని నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ ఛాలెంజ్ చేశారు. మంగళవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మంత్రి మాట్లాడుతూ.. టీసీఎస్(TCS)కు 99 పైసలకు ఇచ్చామని.. టాప్ 100 ఐటీ కంపెనీల్లో ఎవరు వచ్చినా ఇలానే ఇస్తామని అన్నారు. జగన్(Jagan) తీరు దొంగే దొంగ అన్నట్టు ఉందని వ్యాఖ్యలు చేశారు. జగన్ హయాంలో పరిశ్రమలను తరిమేశారని మండిపడ్డారు. లిక్కర్ కేసులో దర్యాప్తు పారదర్శకంగా సాగుతోందని మంత్రి అన్నారు. సీఎం పదవి పోయాక కూడా జగన్ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.

అధికారంలోకి వచ్చాక అహం ఉండకూడదు
రాబోయే ఐదు దశాబ్దాలు పార్టీ భవిష్యత్ బాగుండాలని.. అందుకనే సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టామని అన్నారు. లోకేష్ పార్టీలో ఒక భాగమే అని… ఆయనే పార్టీ కాదని అన్నారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా చేస్తానని.. పార్టీ కార్యకర్తలు ఏ పదవి అడిగినా ఇస్తామని అన్నారు. సీనియర్లు, జూనియర్లు కలిసి పని చేయాలని.. అప్పుడే పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పుకొచ్చారు. కార్యకర్తల్లో కసి ఉందని… బాగా ఆక్టివ్‌గా ఉన్నారన్నారు. అధికారంలో ఉన్నామని.. అధికారంలోకి వచ్చాక అహం ఉండకూడదని అన్నారు. ఒక వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేస్తామని.. మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఈ గ్రూప్ ఉంటుందని తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి భేటీ అవుతారన్నారు. ఇందులో కార్యకర్తల సాధక బాధలు తెలుసుకుంటారని చెప్పారు. పార్టీలో ఎప్పుడు చర్చ అనేది ఉండాలని.. అప్పుడే పార్టీ వైబ్రెంట్‌గా ఉంటుందని అన్నారు. గడిచిన 11 నెలల్లో అన్ని ప్రాంతాలకు ప్రాజెక్ట్‌లు వచ్చాయన్నారు. రాయలసీమలో రెన్యువల్ పవర్‌ను తీసుకొచ్చామని తెలిపారు. పార్టీ కార్యకర్తలు అందరికి ఒకేసారి న్యాయం చేయలేమని.. కానీ పార్టీ కోసం పని చేసిన చాలా మందికి పదవులు ఇచ్చామన్నారు.
అది నా అదృష్టం
కుప్పంలో ఎనిమిది సార్లు చంద్రబాబు గెలిచారు
వన్ క్లాస్ వన్ టీచర్ పాఠశాలలు 9,800 పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. ఒక్క పాఠశాల కూడా మూయలేదన్నారు మంత్రి. ప్రధానితో రెండు గంటల సేపు కూర్చోవడం తన అదృష్టమని చెప్పుకొచ్చారు. ‘నేను ప్రధానికి 20 ప్రశ్నలు వేశాను. ఆయన నాకు తండ్రిలా సమాధానం చెప్పారు’ అని అన్నారు. ప్రభుత్వానికి ఎంత సమయం కేటాయిస్తామో పార్టీకి కూడా అంత సమయం కేటాయిస్తామని వెల్లడించారు. ఈ సారి ప్రభుత్వం, పార్టీని రెండు బ్యాలెన్స్ చేస్తామని తెలిపారు. కుప్పంలో ఎనిమిది సార్లు చంద్రబాబు గెలిచారు కాబట్టి ఆయన మార్క్ డెవలప్‌మెంట్ కనిపిస్తుందన్నారు. సజ్జన్ జిందాల్ కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టేందుకు ముందుకు వచ్చారని.. మరో 15 రోజుల్లో పనులు ప్రారంభిస్తున్నారని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
Read Also: RK: మాజీ ఎమ్మెల్యే ఆర్కేపై సీఐడీ కేసు నమోదు