ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్, మరియు పురపాలక శాఖ మంత్రి నారా లోకేష్, ప్రజల సమస్యలపై సోషల్ మీడియా వేదికగా సత్వరంగా స్పందిస్తున్న తీరు ప్రశంసనీయంగా మారింది. ముఖ్యంగా ట్విట్టర్ (Twitter) వేదికగా ప్రజలు తమ బాధలను, సమస్యలను ప్రత్యక్షంగా మంత్రికి తెలియజేస్తూ పోస్ట్ చేస్తే, ఆయన వెంటనే స్పందించి పరిష్కార మార్గాలను వెతకడం ఇప్పుడు తరచూ కనిపిస్తున్న ఘటనలలో ఒకటిగా మారింది.తాజాగా ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం పరిధిలోని వెల్వడంలో ప్రధాన రహదారి సమస్యను పరిష్కరించాలని కోరుతూ స్థానికులు సోమవారం ప్లెక్సీలు కట్టి నిరసన తెలిపారు. నాలుగు నెలల క్రితం తారు రోడ్డును తొలగించి గ్రావెల్ పోసి వదిలేశారని స్థానికులు ఆరోపించారు. ఈ సమస్య వల్ల విద్యార్థులు కూలీలు ప్రయాణికులు వాహనదారులు అనారోగ్యానికి గురవుతున్నారన్నారు.
ట్రాఫిక్ రోడ్డుతో సంవత్సరాలుగా అధికారులు
ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని మంత్రి లోకేష్ ఈ సమస్య పరిష్కరించాలని ఫ్లెక్సీలో పేర్కొన్నారు’ అంటూ ఆ యువకుడు ట్వీట్ చేశారు.స్థానికులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ‘లోకేష్ అన్న మా ఊరి సమస్యని దయ ఉంచి పరిష్కరించండి.ప్రస్తుతం గ్రాంలో రోడ్డు పరిస్థితి దారుణంగా ఉంది. 10 ఏళ్ల క్రితం వెల్వడం గ్రామంలో కొన్ని సర్వే నంబర్లు నోటిఫై చేయకుండా కొన్ని సర్వే నంబర్లు మాత్రమే నోటిఫై చేసి రోడ్డు నిర్మాణం (Road Construction) చేయడం వల్ల ఇరుకు, ట్రాఫిక్ రోడ్డుతో సంవత్సరాలుగా అధికారులు ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. మళ్లీ 4 నెలల క్రితం తారు రోడ్డు తొలగించి గ్రావెల్ పోసి రోడ్డు పనిని పట్టించుకోకుండా వదిలేశారు. ఈ సమస్య వల్ల స్కూల్ విద్యార్థులకు, కూలీలకు, ప్రయాణికులకు, వాహనదారులకు, అన్ని గ్రామాల ప్రజలు తీవ్ర ఆరోగ్య, ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు.
ట్వీట్‌పై స్పందించిన మంత్రి నారా లోకేష్
కావున నోటిఫై చేయని సర్వే నంబర్లు నోటిఫై చేసి గుంతలమయంగా మారిన రోడ్డును నిర్మాణం చేసి వెల్వడం గ్రామ సమస్యను, ప్రయాణికుల సమస్యను త్వరగా పరిష్కరించగలరని ప్రార్థిస్తున్నాము’ అన్నారు.ఈ ట్వీట్‌పై స్పందించిన మంత్రి నారా లోకేష్ ‘రోడ్డు బాగాలేకపోవడం వల్ల వెల్వడం గ్రామ (Velwadam village) ప్రజలకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాను. నాలుగు నెలల క్రితం తారు రోడ్డును తొలగించారు.దాని స్థానంలో కంకర రోడ్డు వేశారు. దీని వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారన్న విషయం నాకు తెలుసు. స్థానిక MLA వసంత కృష్ణ ప్రసాద్ గారితో మాట్లాడతాను. అధికారులతో కూడా మాట్లాడి వీలైనంత త్వరగా రోడ్డును త్వరగా బాగు చేయిస్తాను’ అన్నారు.
Read Also: Govindaraja Swamy: తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం వద్ద అగ్నిప్రమాదం