हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Nara Bhuvaneswari: తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నారా లోకేశ్

Sharanya
Nara Bhuvaneswari: తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నారా లోకేశ్

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గారి సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) గారు నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయంగా బిజీ షెడ్యూల్ మధ్య కుటుంబానికి అధిష్ఠానం వహిస్తూ, మౌనంగా తన స్ఫూర్తితో ముందుకు నడిపించే మహిళగా నారా భువనేశ్వరి గారిని వారు ప్రశంసించారు.

చంద్రబాబు ట్వీట్: “నువ్వు నా జీవితానికి వెలుగు”

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన భార్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ హృదయాన్ని తాకేలా స్పందించారు. నీ ప్రేమ, బలం మన కుటుంబానికి పునాది వంటివి. జీవితంలోని ప్రతి ఒడిదుడుకులోనూ నా పక్కనే నిలిచావు. ఆమె పట్ల తన గౌరవాన్ని, అభిమానాన్ని వ్యక్తపరిచారు.

లోకేశ్ ట్వీట్: “నువ్వే నా బలం, నా మార్గదర్శి”

ఇంట్లో తల్లిగా, కుటుంబానికి బలంగా నిలిచే భువనేశ్వరి గారిపై నారా లోకేశ్ ప్రేమతో, గౌరవంతో కూడిన సందేశాన్ని ‘ఎక్స్’ వేదికగా షేర్ చేశారు.

పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా! నువ్వే నా బలం, నా మార్గదర్శి, మా కుటుంబానికి గుండెకాయ. నీ నిస్వార్థమైన ప్రేమ, మౌనంగా నువ్వు చూపించే ధైర్యం నన్ను ఎంతగానో తీర్చిదిద్దాయి. నాకు నేర్పిన విలువలకు, ప్రతీరోజూ మా జీవితాల్లోకి నువ్వు తీసుకొచ్చే ఆత్మీయతకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ ఏడాది నీకు సంతోషం, ఆరోగ్యం, ప్రేమతో నిండిపోవాలని కోరుకుంటున్నాను” అని లోకేశ్ త‌న పోస్టులో రాసుకొచ్చారు.

కోడలు బ్రాహ్మణి ప్రేమతో…

నారా బ్రాహ్మణి కూడా తన అత్తకు ఆత్మీయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. భువనేశ్వరి గారు తనకు కోడలిగా మారకముందే ఆదర్శంగా కనిపించారని తెలిపారు. “పుట్టినరోజు శుభాకాంక్షలు భూ అత్తా! నేను నీ కోడలు కాకముందు నుంచే నువ్వు నాకు ఆదర్శం. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నీ దృఢత్వం, హుందాతనం, నిస్వార్థమైన ప్రేమ నన్ను ఎంతగానో తీర్చిదిద్దాయి. నా అత్తగా, మార్గదర్శిగా, నా ధైర్యానికి గొప్ప మూలంగా ఉన్నందుకు ధన్యవాదాలు” అని పోస్ట్ చేశారు.

Read also: Nara Bhuvaneswari: తన సతీమణికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870