ఆంధ్రప్రదేశ్ లోని, నంద్యాల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు (Nandyala Road Accident) ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. శిరివెళ్లమెట్ట సమీపంలో నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. టైరు పేలి అదుపుతప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ఘటనలో ముగ్గురు చనిపోయారు. నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఏఆర్‌బీసీవీఆర్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు..
Read Also: Pawan Kalyan Kotappakonda : నేడు కోటప్పకొండకు పవన్ కళ్యాణ్
గుర్తుపట్టలేనంతగా బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్, క్లీనర్‌ల మృతదేహాలు
బస్సు టైరు ఒక్కసారిగా పేలింది. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను దాటింది. ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని బస్సు బలంగా ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మరణించారు.ఈ క్రమంలో పది మందికి పైగా ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు బస్సు, లారీ పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రయాణికుల లగేజీ మొత్తం కాలి బూడిదైంది.

బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్, క్లీనర్‌ల మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, డీసీఎం డ్రైవర్ సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని, లేదంటే మృతుల సంఖ్య భారీగా ఉండేదని అధికారులు, ప్రయాణికులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: