हिन्दी | Epaper

Nagalakshmamma: మహిళా తహశీల్ధార్‌పై వ్యక్తి కొడవలితో దాడి

Sharanya
Nagalakshmamma: మహిళా తహశీల్ధార్‌పై వ్యక్తి కొడవలితో దాడి

తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలంలో శుక్రవారం చోటుచేసుకున్న ఘటన స్థానికంగా కాదు, రాష్ట్రవ్యాప్తంగా కూడా కలకలం రేపుతోంది. అయినవిల్లి తహశీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా తహశీల్దార్ నాగలక్ష్మమ్మపై మీసాల సత్యనారాయణ అనే వ్యక్తి అనూహ్యంగా కొడవలితో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన అధికారుల భద్రతపై సందేహాలు రేకెత్తించడమే కాక, మానసిక ఆరోగ్య సమస్యలను ఎలా నిర్ధారించాలి అనే ప్రశ్నను కూడా తెరపైకి తెచ్చింది.

ఘటన ఎలా జరిగింది?

జోగిరాజుపాలెం గ్రామానికి చెందిన మీసాల సత్యనారాయణ, అనే వ్యక్తి నిన్న చేతి సంచిలో కొడవలి పట్టుకుని నేరుగా కార్యాలయంలోకి వెళ్లి తహశీల్దార్ నాగలక్ష్మమ్మపై విసిరాడు. దీంతో ఆమె చేతికి గాయమైంది. సిబ్బంది వెంటనే అప్రమత్తమై అతన్ని కార్యాలయం నుంచి బయటకు తీసుకువెళ్లారు. ఆ సమయంలో అతను మద్యం తాగి ఉన్నాడని తెలిపారు.

మద్యం మత్తులో విచక్షణ లేకుండా..?

సత్యనారాయణ ఘటన జరిగిన సమయంలో మద్యం తాగి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. గతంలోనూ ఓ నేర సంఘటనలో అతను జైలుకు వెళ్లి వచ్చాడని స్థానికులు చెబుతున్నారు. తన కొబ్బరితోటలు ఇతరులు ఆక్రమించుకున్నారని, భూపత్రాలు ఇప్పించాలంటూ అమలాపురంలో కలెక్టర్ కార్యాలయం, స్థానిక ఎంపీడీఓ, పోలీస్ స్టేషన్, పంచాయతీ కార్యాలయాల చుట్టూ అతను తిరుగుతుంటాడని స్థానికులు చెబుతున్నారు.

గ్రామస్థుల మాటల్లో…

కొన్నాళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని, మద్యం సేవించి రహదారిపై కేకలు వేసుకుంటూ వెళ్తుంటాడని అంటున్నారు. అయితే సత్యనారాయణకు గ్రామంలో ఎటువంటి భూములు, భూసంబంధిత సమస్యలు లేవని తహశీల్దార్ నాగలక్ష్మమ్మ తెలిపారు.

అధికారుల స్పందన

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సత్యనారాయణను అరెస్టు చేశారు. కాగా, తహశీల్దార్‌ను కొత్తపేట ఆర్డీవో శ్రీకర్ పరామర్శించారు. తహశీల్దార్ పై మారణాయుధంతో దాడి చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. తహశీల్దార్‌ను ఆయన ఫోన్‌లో పరామర్శించారు.

Read also: Rajahmundry: ఈ నెల 19న అఖండ గోదావరి ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

📢 For Advertisement Booking: 98481 12870