हिन्दी | Epaper

Kova Bun Seller : వలీకి రూ.25వేల ఆర్థిక సాయం చేసిన నాగబాబు

Sudheer
Kova Bun Seller : వలీకి రూ.25వేల ఆర్థిక సాయం చేసిన నాగబాబు

కర్నూలుకు చెందిన కోవాబన్ వ్యాపారి వలీకి జనసేన నేత, ఎమ్మెల్సీ నాగబాబు అండగా నిలిచారు. కర్నూలు నగరంలో కోవాబన్ విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న వలీ అనే సామాన్య వ్యాపారికి జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు తన వంతు సాయం అందించారు. మంగళవారం వలీని స్వయంగా కలిసిన నాగబాబు, ఆయన విక్రయించే కోవాబన్‌ను రుచి చూశారు. అనంతరం వలీ కుటుంబ పరిస్థితులు, వ్యాపార స్థితిగతులను అడిగి తెలుసుకున్న ఆయన, తక్షణ సాయం కింద రూ. 25,000 నగదును అందజేశారు. కష్టపడి పని చేస్తూ, తనకున్న పరిమిత వనరులతో గౌరవంగా బతుకుతున్న ఒక సామాన్యుడికి అండగా నిలబడాలనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాగబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Bengaluru : వాష్ రూమ్ లో ఉన్న హీరోయిన్ను వీడియో తీసి బ్లాక్మెయిల్

ఈ సందర్భంగా నాగబాబు సోషల్ మీడియాలో వలీపై జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. కేవలం ఒక వ్యక్తి చేస్తున్న వ్యాపారాన్ని మతపరమైన కోణంలో చూడటం ఏమాత్రం సమంజసం కాదని ఆయన హితవు పలికారు. కులమతాలకు అతీతంగా కష్టపడే ప్రతి శ్రామికుడికి సమాజంలో గౌరవం దక్కాలని, అనవసరంగా మత రంగు పులిమి ఒకరి జీవనోపాధిని దెబ్బతీయడం అన్యాయమని ఆయన స్పష్టం చేశారు. వలీ వంటి చిన్న తరహా వ్యాపారులను ప్రోత్సహించాలే తప్ప, ఇటువంటి వివాదాల్లోకి లాగకూడదని ఆయన కోరారు. నాగబాబు చేసిన ఈ పనిని చూసి స్థానికులు మరియు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

📢 For Advertisement Booking: 98481 12870