Cyclone Bapatla Holiday: ‘మురసు’ తుఫాన్.. రేపు బాపట్ల జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు

Follow Us: Google News Daily Hunt
Cyclone Bapatla Holiday
Cyclone Bapatla Holiday
FONT SIZE
GET APP

Cyclone Bapatla Holiday: ఆంధ్రప్రదేశ్: ‘మురసు’ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున బాపట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తుఫాన్ ముప్పు దృష్ట్యా మంగళవారం జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు (పాఠశాలలు, కళాశాలలకు) సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు.

Read Also : Murasu Cyclone: మురసు తుఫాన్ ఫిర్యాదుల నంబర్ 112

Cyclone Bapatla Holiday
Cyclone ‘Murasu’ – Holiday for educational institutions in Bapatla district tomorrow

Cyclone Bapatla Holiday: తీరం దాటనున్న తుఫాన్..

ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ‘మురసు’ తుఫాన్, సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము సమయంలో ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుఫాన్ ప్రభావంతో సముద్రం అలజడిగా మారడంతో నిజాంపట్నం హార్బర్ వద్ద అత్యంత ప్రమాదకరమైన పదో నంబర్ హెచ్చరికను జారీ చేశారు.

తుఫాన్ ఉధృతి నేపథ్యంలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సూర్యలంక బీచ్‌కు పర్యాటకులు ఎవరూ రావద్దని అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తీరప్రాంత గ్రామాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని జిల్లా యంత్రాంగం సూచించింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు