हिन्दी | Epaper
నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు

Andhra Pradesh: తల్లి,కూతుళ్ల పై ప్రేమోన్మాది దాడి తల్లి మృతి

Anusha
Andhra Pradesh: తల్లి,కూతుళ్ల పై ప్రేమోన్మాది దాడి తల్లి మృతి

విశాఖపట్నంలో కొమ్మాది స్వయంకృషినగర్‌ లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ప్రేమోన్మాది ఓ యువతి ఆమె తల్లిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తల్లి లక్ష్మి (43) మృతి చెందగా కుమార్తె దీపిక (20)కు తీవ్ర గాయాలయ్యాయి.యువతి తల్లి రక్తపు మడుగులో విగతజీవిగా పడిపోయింది. ఇక ఆ యువతి కూడా రక్తపు మడుగులోని కొన ఊపిరితో కొట్టుకుంటుండగా స్థానికులు గమనించి ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. యువతికి తీవ్ర గాయాలు కావడంతో ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. మరోవైపు తల్లీ కుమార్తెలపై కత్తితో దాడి చేసిన తర్వాత ఆ ప్రేమోన్మాది అక్కడి నుంచి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో పీఎం పాలెం పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కిరాతకంగా

బాధితురాలు దీపిక ఇంట్లో కి మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఓ యువకుడు చొరబడ్డాడు. అనంతరం దీపిక, ఆమె తల్లిపై అత్యంత కిరాతకంగా కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఈ ఘటనలో దీపిక తల్లి లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. డిగ్రీ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటున్న దీపికను నవీన్‌ అనే వ్యక్తి ప్రేమించాడని అతడే ఈ దాడి చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

నిందితుడు

పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇంతకీ ఆ నిందితుడు ఎవరు ఎందుకు గొడవ వచ్చింది,అనే విషయాలు వెల్లడి కాలేదు. విశాఖలో గతంలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఆ ఘటన ఇంకా మరువకముందే తాజాగా కొమ్మాది స్వయంకృషినగర్‌లో జరిగిన మరో సంఘటన నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది.

murder 2 21

ఇటీవల కాలంలో

ఇటీవల కాలంలో ప్రేమోన్మాదుల దాడులు పెరుగుతుండటంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.ప్రేమకు నిరాకరించారని యువతులపై యువకులు దాడులు చేస్తున్న ఘటనలు దేశంలోని పలు రాష్ట్రాల్లో రోజూ ఏదో ఒక చోట చోటు చేసుకుంటున్నాయి.రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహ ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా నమోదవుతున్నాయి.

హోంమంత్రి అనిత స్పందన

ఈ దారుణ ఘటనపై హోంమంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చితో ఫోన్‌లో మాట్లాడి, బాధితురాలు దీపిక ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.యువతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.నిందితుడిని త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని సూచించారు.యువతి తల్లి లక్ష్మి మృతిపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పరకామణి వ్యవహారంపై సీఐడీ పరిశీలనకు కోర్టు ఆదేశం

పరకామణి వ్యవహారంపై సీఐడీ పరిశీలనకు కోర్టు ఆదేశం

AI డిమాండ్ కు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది – నారా లోకేశ్

AI డిమాండ్ కు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది – నారా లోకేశ్

సంక్రాంతి సెలవులకు ముందు FA-3 పరీక్షలు

సంక్రాంతి సెలవులకు ముందు FA-3 పరీక్షలు

డబుల్ ఇంజిన్ సర్కారుతోనే రాష్ట్రాభివృద్ధి – కిషన్

డబుల్ ఇంజిన్ సర్కారుతోనే రాష్ట్రాభివృద్ధి – కిషన్

నువ్వు మీ పెద్ద నాయకుడివేమో ..బయట కాదు జగన్ పై బాబు సెటైర్లు

నువ్వు మీ పెద్ద నాయకుడివేమో ..బయట కాదు జగన్ పై బాబు సెటైర్లు

కృష్ణా తీరంలో వేదాంత ఆన్షార్ బావులకు గ్రీన్ సిగ్నల్

కృష్ణా తీరంలో వేదాంత ఆన్షార్ బావులకు గ్రీన్ సిగ్నల్

2025–26లో బీసీ విద్యార్థులకు ₹90.50 కోట్ల స్కాలర్‌షిప్ మంజూరు

2025–26లో బీసీ విద్యార్థులకు ₹90.50 కోట్ల స్కాలర్‌షిప్ మంజూరు

విశాఖ వద్ద ఆటో బోల్తా.. ఐదుగురికి గాయాలు
1:07

విశాఖ వద్ద ఆటో బోల్తా.. ఐదుగురికి గాయాలు

తిరుపతిలో జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం

తిరుపతిలో జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం

పుంగనూరులో కూటమి పాలనపై పెద్దిరెడ్డి విమర్శల వర్షం

పుంగనూరులో కూటమి పాలనపై పెద్దిరెడ్డి విమర్శల వర్షం

సోషల్ మీడియా దుర్వినియోగంపై చంద్రబాబు హెచ్చరిక

సోషల్ మీడియా దుర్వినియోగంపై చంద్రబాబు హెచ్చరిక

ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. మోసపోయిన యువతి‌

ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. మోసపోయిన యువతి‌

📢 For Advertisement Booking: 98481 12870