నెల్లూరు : ప్రస్తుతానికి నెల్లూరుకు ఔటర్ రింగ్ రోడ్డు అవసం లేదని మంత్రి పొంగూరు నారాయణ(Minister Narayana) స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్ వేయాలన్న నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఉద్దేశం సరైనదేనన్నారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం సాధ్యం కాదన్నారు. గతంలో ట్రాఫిక్ అంతా ట్రంక్ రోడ్డు మీద హైవే కు వెళ్లేదని, రోడ్డును రెండుగా డివైడ్ చేసేదన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు ఉండేవన్నారు.
Read also: Minister Savithamma: విద్యతోనే బిసిలు శాసించే స్థాయికి

మినీ బైపాస్ ఏర్పాటు తర్వాత ట్రంక్ రోడ్డులో ట్రాఫిక్ తగ్గిందన్నారు. త్వరలో నాలుగు లైన్ల బైపాస్ను ఆరు లైన్లు చేస్తున్నారని, రూరల్, సిటీలో హైవే పై రెండు అండర్ పాస్లు రాబోతున్నాయన్నారు. ఔటర్ రింగ్ రోడ్కి రూ.2 వేల కోట్లకు పైగా నిధులు కావాలన్నారు. రోడ్డు డిజైన్, భూ సమీకరణకు ఎక్కువ నిధులు(Minister Narayana) అవసరం అవుతాయన్నారు. ప్రస్తుత ఆర్థిక స్థితిలో అంత కేటాయించే పరిస్థితి లేదన్నారు. తమ అజెంబాలో ఔటర్ రింగ్ రోడ్డు ప్రస్తావన లేదన్నారు. జనాభా పెరిగి ఇబ్బందుల వస్తే ఓ ఆర్ ఆర్ గురించి ఆలోచిస్తామని ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించటమే ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన అజెండాగా మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: