ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా : కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం వలసపాకల బీచ్ రోడ్డులో కోరమాండల్ ఎరువుల కర్మాగారం ఆధ్వర్యంలో అత్యాధునిక వసతులతో ఏర్పాటుచేసిన 60 పడకల ఆసుపత్రి నూతన భవనాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్,(Minister NaraLokesh) కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేతుల మీదుగా ప్రారంభించారు.
Read Also:AP: పల్నాడు జిల్లా మాచర్లలో పిచ్చికుక్క బీభత్సం

ముందుగా ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు కోరమండల్ ఇంటర్నేషనల్ నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం 60 పడకల ఇంటిగ్రేటెడ్ కోరమాండల్ హాస్పటల్ నూతన భవనాన్ని రిబ్బన్ కట్ చేసి మంత్రి(Minister NaraLokesh) ప్రారంభించారు. ఆసుపత్రి భవనం మొత్తం కలియతిరిగి వసతులను పరిశీలించారు. కింద కార్పోరేట్ సామాజిక బాధ్యత కోరమాండల్ సంస్థ గత కొన్నేళ్లుగా అవుట్ పేషంట్ హాస్పిటల్ ను నిర్వహిస్తోంది.
కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల నుంచి ఏడాదికి 1.2 లక్షల మందికి పైగా రోగులకు సేవలందించడం జరుగుతోంది. మొదటి దశలో ఆసుపత్రి అభివృద్ధికి రూ.8 కోట్లు వెచ్చించారు. రెండో దశలో ప్రస్తుతం రూ.32 కోట్లు వెచ్చించి ఇన్ పేషంట్ సదుపాయాలను కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎమ్ఎమ్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ ఎం.ఏ అలగప్పన్, ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎస్. శంకరనుబ్రహ్మణ్యన్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అరుణ్ అలగప్పన్, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ డైరెక్టర్ వి. నారాయణన్ తో పాటు ఎంపీ సానా సతీష్, మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, రాజమండ్రి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: