ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులకు దారులు విప్పుతోంది. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రెస్టేజ్ గ్రూప్‌ను ఆహ్వానించారు. బెంగళూరులో ప్రెస్టేజ్ గ్రూప్ చైర్మన్ ఇర్ఫాన్ రజాక్ (Prestige Group Chairman Irfan Razak), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాయాద్ నౌమాన్‌లతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉంది. రూ.65 వేల కోట్లతో అమరావతి పనులు వేగంగా సాగుతున్నాయి. విశాఖపట్నం ఐటీ హబ్‌గా ఎదుగుతోంది. గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలు ఇక్కడ పునాది వేసాయి అని వివరించారు.

రాయలసీమలో గ్రీన్ ఎనర్జీకి ఆదరణ
“రాయలసీమలో రిలయన్స్, రెన్యూ సంస్థలు గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో భారీగా పెట్టుబడులకు ముందుకొచ్చాయి. గత ఏడాది కేవలం రూ.9.5 లక్షల కోట్ల పెట్టుబడులే రాష్ట్రానికి వచ్చాయి” అని తెలిపారు.ప్లగ్ అండ్ ప్లే విధానంలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని లోకేశ్ వివరించారు. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రెస్టేజ్ గ్రూప్ రాష్ట్రంలో ప్రాజెక్టులు చేపట్టాలని కోరారు.
సానుకూలంగా స్పందించిన ప్రెస్టేజ్ గ్రూప్
ప్రెస్టేజ్ గ్రూప్ ఛైర్మన్ ఇర్ఫాన్ రజాక్ ఈ అంశంపై సానుకూలంగా స్పందించారు. “ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అవకాశాలు పరిశీలిస్తాం” అని హామీ ఇచ్చారు. ఈ సంస్థ ఇప్పటికే దేశవ్యాప్తంగా 13 ప్రధాన నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.ఇప్పటివరకు 350కి పైగా ప్రాజెక్టులు పూర్తిచేసిన ప్రెస్టేజ్ గ్రూప్, రియల్ ఎస్టేట్ రంగంలో క్రిసిల్ డీఏ1+ రేటింగ్ పొందిన ఏకైక భారతీయ సంస్థగా నిలిచింది.
Read Also : Chalam : శారదను చాలా ఇబ్బందిపెట్టాడన్న హరిశ్చంద్రరావు