నరసాపురం : రైలు ప్రయాణం వర్తక, వాణిజ్య వ్యాపా రాలకు, తీర ప్రాంత మత్స్య పరిశ్రమ అభివృద్ధిలో కోస్తా జిల్లా మణిహారంగా నిలుస్తుందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ( Minister Bhupathiraju) అన్నారు. సోమవారం నరసాపురం చెన్నై వందే భారత్(Vande Bharat) రైలును కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అశేష జనవాహిని మధ్య లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు.
Read Also: VandeBharat: నర్సాపూర్–చెన్నై వందే భారత్ ప్రారంభం..షెడ్యూల్, స్టాప్స్, టికెట్ ధరలు ఇవే

ఈ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయ్నీ అస్మి, నరసాపురం, తాడేపల్లి గూడెం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ లు: బొమ్మిడి నాయకర్, బొలిశెట్టి శ్రీనివాస్, భీమవరం శాసనసభ్యులు మరియు పి. ఎస్.సి చైర్మన్ పులపర్తి రామాంజనేయు ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, రాష్ట్ర మహిళా ఆర్థిక కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ షరీఫ్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేంద్ర మంత్రి భూపతిరాజు( Minister Bhupathiraju) శ్రీనివాస వర్మ మాట్లాడుతూ వర్తక, వాణిజ్య వ్యాపారా లకు, మత్స్య పరిశ్రమ అభివృద్ధికి వందే మాతరం రైలు నరసాపురం వరకు పొడిగింపుతో ఈ ప్రాంతం విశేషంగా అభివృద్ధి చెందుతుందన్నారు. మత్స్య పరిశ్రమ పురోభివృద్ధి చెందాలంటే రైలు కనెక్టివిటీ చాలా ముఖ్యమన్నారు.
నర్సా పురం నుండి హైదరాబాద్, బెంగళూరు వెళ్లే వందే భారత్ రైలు సర్వీసుల కోసం సంబంధిత కేంద్ర మంత్రితో, అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు శ్రీనివాస వర్మ తెలిపారు. సికింద్రాబాద్ నుండి విశాఖ పట్నం వెళ్లే వందే భారత్ రైలు తాడేపల్లి గూడెంలో కూడా ఆగేలా ఏర్పాటు చేస్తాన న్నారు. జిల్లా అభివృద్ధికి నరసాపురం లూప్ లైన్లో ఉన్న ప్రాంతాన్ని కూడా కలుపుతూ కొత్త రైల్వే సర్వీసుల కోసం చర్యలు తీసుకుంటానని తెలిపారు. అరుణాచలం ఎక్స్ ప్రెస్ను రెగ్యులర్ చేస్తా మని ఇక్కడి నుండి వారణాసికి ఎక్స్ ప్రెస్ను తెచ్చేందుకు కృషి జరుగుతుందన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: