ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల ఆర్థిక భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 19న మరో ముఖ్యమైన పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. పీఎం కిసాన్‌తో పాటు అన్నదాత సుఖీభవ స్కీమ్‌నూ అమలు చేయనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు ( Minister Atchannaidu) వెల్లడించారు.
Read Also: Parental behavior : పిల్లలపై తల్లిదండ్రుల ప్రవర్తన ప్రభావం

రెండో విడతలో మొత్తం రూ.7,000 లబ్ధి
రెండో విడతలో రాష్ట్ర వాటా రూ.5వేలు, కేంద్రం వాటా రూ.2వేలు కలిపి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. కడప జిల్లా కమలాపురంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈ నిధులను విడుదల చేస్తారన్నారు. మొత్తంగా 46,62,904 మంది రైతులకు రూ.3,077 కోట్ల మేర లబ్ధి చేకూరుతుందని వివరించారు (Minister Atchannaidu).
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: